తెలంగాణ తల్లి ముసుగువీడేదెన్నడో ? | Sakshi
Sakshi News home page

తెలంగాణ తల్లి ముసుగువీడేదెన్నడో ?

Published Tue, Jan 17 2017 10:36 PM

తెలంగాణ తల్లి ముసుగువీడేదెన్నడో ? - Sakshi

► ప్రారంభానికి నోచుకోని తెలంగాణ తల్లి విగ్రహం..
► అధికారపార్టీ నేతలే పట్టించుకోని వైనం

ఓదెల: మండలంలోని  శానగొండలో తెలంగాణ తల్లివిగ్రహం ప్రారంభోత్సవానికి ముహుర్తం కుదరడం లేదు. ఆరునెలలుగా ఇప్పుడో అప్పుడో ప్రారంభం చేస్తారని గ్రామస్తులు ఎదురు చూస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో ఊరూర తెలంగాణ త ల్లీ విగ్రహలు ఏర్పా టుచేసిన అధికార పార్టీ నాయకులు, అధికారంలోకి వచ్చాక వాటిని పట్టించుకోవడం లేదని గ్రామస్తులు చర్చించుకుంటున్నారు. ఆరునెలలుగా తెలంగాణ తల్లి ముసుగులోనే  ఉండటంతో ఇంకెప్పుడు విముక్తి లభిస్తుందని  తెలంగాణ వాదులు పేర్కొంటున్నారు. తెలంగాణ ఉద్యమంలో భాగంగా ఇదేగ్రామానికి చెందిన సింగరేణి ఉద్యోగి విజ్జిగిరి శంకరయ్య  స్వచ్చంధంగా తెలంగాణతల్లి విగ్రహన్ని స్వంతఖర్చులతో ఎర్పాటుచేశారు.

గ్రామపంచాయతీ ముందు ప్రధానరోడ్డుకు ప్రక్కనగల విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆరునెలలుగా విగ్రహం ఎండలో ఎండుతూ, వానలో నానుతూ.. ఆదరణకు నోచుకొవటంలేదు. విగ్రహదాత శంకరయ్య మాత్రం విగ్రహన్ని ఆవిష్కరించాలని అధికార పార్టీ నాయకులతో గోడు వెల్లబోసుకుంటున్నాడు. గ్రామంలో రెండు వర్గాల మధ్య సయోద్య కుదరకనే ముసుగు వీడటం లేదనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రధానరోడ్డు పక్కన విగ్రహం ముసుగులో ఉండడంతో ప్రయాణికులు ఎప్పుడు ముసుగు తొలగిస్తారో అని ఎదురుచూస్తున్నారు.  స్థానిక ఎమ్మెల్యే దాసరి మనోహర్‌రెడ్డి, ఎంపీ బాల్క సుమన్, తెలంగాణ జాగృతి వ్యవస్థాపకురాలు, నిజామాబాద్‌ ఎంపీ కవితలు ప్రత్యేక చొరవ తీసుకొని తెలంగాణతల్లి విగ్రహన్ని ప్రారంభించాలని తెలంగాణ వాదులు,గ్రామస్తులు కోరుతున్నారు.  

Advertisement

తప్పక చదవండి

Advertisement