కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పదవి లేనప్పుడు ఉద్యమం చేసి.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆయనకు అలవాటు అని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ విమర్శించారు.
పశ్చిమగోదావరి జిల్లా: కాపు ఉద్యమ నాయకుడు, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం పదవి లేనప్పుడు ఉద్యమం చేసి.. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేయడం ఆయనకు అలవాటు అని ప్రభుత్వ విప్ అంగర రామ్మోహన్ విమర్శించారు.
మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కాపులకు రిజర్వేషన్లు ఇస్తే తమకు సమ్మతమేనని చెప్పారు. రాజకీయ రిజర్వేషన్లలో స్పష్టత ఉండాలన్నారు. తమకు మాత్రం అన్యాయం జరగకూడదని అంగర రామ్మోహన్ కోరారు.