గోడ కూలి ఒకరు మృతి | wall falled on a person.. he died | Sakshi
Sakshi News home page

గోడ కూలి ఒకరు మృతి

Aug 10 2016 12:11 AM | Updated on Sep 28 2018 3:41 PM

ఇంటి గోడను కూలుస్తుండగా మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం సా యంత్రం జరిగింది.

నెక్కొండ : ఇంటి గోడను కూలుస్తుండగా మీదపడి ఓ వ్యక్తి మృతిచెందిన సంఘటన మండలంలోని నాగారం గ్రామంలో మంగళవారం సా యంత్రం జరిగింది. గ్రామానికి చెందిన పూర్ణకంటి యాకయ్య(50) ఉదయాన్నే అదే గ్రామానికి చిదురాల యాకూబ్‌కు చెందిన పాత ఇంటి ని కూల్చేందుకు కూలీకి వెళ్లాడు. ఈ క్రమంలో ఉదయం నుంచి సాయంత్రం వరకు పనిచేశాడు. సాయంత్రం ఇంటికి వెళ్లే కొద్ది సమయం ముందు ఇల్లును ధ్వంసం చేస్తుండగా ప్రమాదవశాత్తు గోడ కూలి మీద పడడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. మృ తుడికి భార్య లక్ష్మి, ముగ్గురు కుమారులు ఉన్నారు.
  

Advertisement
 
Advertisement
Advertisement