మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు | vips in mahanandi | Sakshi
Sakshi News home page

మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు

Nov 12 2016 9:37 PM | Updated on Sep 4 2017 7:55 PM

మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు

మహానందీశ్వరుడి సేవలో ప్రముఖులు

మహానందీశ్వరుడి సన్నిధిలో శనివారం పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు.

మహానంది: మహానందీశ్వరుడి సన్నిధిలో శనివారం పలువురు ప్రముఖులు పూజలు నిర్వహించారు. కర్నూలు జిల్లా ప్రధాన న్యాయమూర్తి అనుపమ చక్రవర్తి కుటుంబ సభ్యులతో కలిసి మహానందికి వచ్చారు. ఈ సందర్భంగా ఆలయ ప్రొటోకాల్‌ ఇన్‌స్పెక్టర్‌ శ్రీనివాసరావు న్యాయమూర్తి దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి శ్రీ కామేశ్వరీదేవి సహిత శ్రీ మహానందీశ్వరస్వామి వారిని దర్శించుకుని అభిషేకం, కుంకుమార్చన పూజలు నిర్వహించారు. అలాగే నంద్యాలకు చెందిన న్యాయమూర్తులు రామ్మోహన్, నాగేశ్వరరావు, ఎం.కుమారి, శైలజలు వేర్వేరుగా మహానంది క్షేత్రానికి వచ్చి  స్వామి వారిని దర్శించుకున్నారు. వీరితోపాటు జిల్లా పరిషత్‌ సీఈఓ ఈశ్వర్, ఇన్‌కంట్యాక్స్‌ జాయింట్‌ కమిషనర్, ఐఆర్‌ఎస్‌ అధికారి సత్యనారాయణ (విజయవాడ రేంజ్‌) మహానందికి వచ్చారు. వీరికి దేవస్థానం పాలకమండలి చైర్మన్‌ పాణ్యం ప్రసాదరావు,  సూపరింటెండెంట్‌ ఈశ్వర్‌రెడ్డి స్వాగతం పలికారు. దర్శనం అనంతరం వారికి స్వామి, అమ్మవారి ప్రసాదాలు అందించి ఆశీర్వచనాలు చేయించారు.   
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement