చిన్నారి ప్రాణం తీసిన విక్స్.. | vicks Can stuck in the throat of the infant | Sakshi
Sakshi News home page

చిన్నారి ప్రాణం తీసిన విక్స్..

Jan 6 2016 8:04 PM | Updated on Apr 4 2019 12:50 PM

విక్స్ డబ్బా ఓ చిన్నారి ప్రాణం తీసింది.

విక్స్ డబ్బా ఓ చిన్నారి ప్రాణం తీసింది. ఆడుకుంటూ నోట్లో పెట్టుకోవడంతో అది గొంతులో ఇరుక్కుని మృతి చెందింది. ఆదిలాబాద్ జిల్లా భైంసా మండలం మహాగాం గ్రామంలో మంగళవారం రాత్రి ఈ ఘటన జరిగింది. కారగిరి గణేశ్, వనజ దంపతుల 15 నెలల సాయికృతిక్ష మంగళవారం రాత్రి మంచంపై ఆడుకుంటూ అక్కడే ఉన్న విక్స్ డబ్బాను తీసుకుని నోట్లో పెట్టుకుంది.

అది గొంతులోకి జారి ఇరుక్కుపోయింది. పక్కనే ఉన్న తల్లిదండ్రులు విక్స్ డబ్బాను తీసేందుకు ప్రయత్నించారు. రాకపోవడంతో వెంటనే భైంసా ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆ చిన్నారి ఊపిరాడక మృతి చెందింది. చేతిలో ఆడుకోవడానికి తీసుకున్న విక్స్ డబ్బా తమ పాప పాలిట మృత్యువుగా మారుతుందని ఊహించలేకపోయామని తల్లిదండ్రులు కంటతడి పెట్టడం అక్కడున్న వారిని కదిలించింది.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement