
తిరుమలకు కూరగాయల వితరణ
ప్రతి ఒక్కరూ దైవమంటే భక్తితోపాటు ఇతరులకు సాయంచేసే గుణాన్ని కలిగి ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు.
విజయవాడ (పటమట) : ప్రతి ఒక్కరూ దైవమంటే భక్తితోపాటు ఇతరులకు సాయంచేసే గుణాన్ని కలిగి ఉండాలని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ అన్నారు. పటమట ఫన్‌టైమ్ క్లబ్ వద్ద తిరులమల తిరుపతి దేవస్థానం నిత్యాన్నదాన పథకానికి మండవ కుటుంబరావు ఆధ్వర్యంలో 10 టన్నుల కూరగాయల పంపిణీ శనివారం జరిగింది. కూరగాయలతో నిండిన వాహనానికి గద్దె జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో యలమించిలి హిమబిందు, స్థానిక కార్పొరేటర్ జాస్తి సాంబశివరావు, ఫన్‌టైమ్ క్లబ్ కార్యదర్శి వేమూరి సాంబశివరావు తదితరులు పాల్గొన్నారు.