ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం | valmikis development posible only with away from faction | Sakshi
Sakshi News home page

ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం

Oct 16 2016 11:16 PM | Updated on Sep 4 2017 5:25 PM

ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం

ఫ్యాక్షన్‌కు దూరమైతేనే వాల్మీకుల అభివృద్ధి సాధ్యం

జిల్లాలోని వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు.

– జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌
– ఘనంగా వాల్మీకి మహర్శి జయంతి ఉత్పవాలు
 
కర్నూలు(అర్బన్‌): జిల్లాలోని వాల్మీకులు ఫ్యాక్షన్‌కు దూరంగా ఉంటేనే అభివృద్ధి సాధ్యమవుతుందని జిల్లా కలెక్టర్‌ సీహెచ్‌ విజయమోహన్‌ అన్నారు. మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా ఆదివారం సాయంత్రం స్థానిక కలెక్టరేట్‌లోని సునయన ఆడిటోరియంలో జిల్లా బీసీ సంక్షేమాధికారి డీ హుసేన్‌సాహెబ్‌ అధ్యక్షతన ఉత్సవ వేడుకలు ఘనంగా నిర్వమించారు. ముందుగా కార్యక్రమానికి హాజరైన అధికారులు, నాయకులు వాల్మీకి చిత్ర పటానికి పూలమాలలు వేసి పూజలు నిర్వహించారు. అనంతరం జరిగిన సభలో కలెక్టర్‌ మాట్లాడుతూ జిల్లాలో ఫాక‌్షన్‌ రాజకీయాలకు ఎంతో మంది బోయలు బలైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రతి ఒక్క వాల్మీకి తన కుటుంబం, పిల్లల చదువుపై దృష్టి సారించాలన్నారు. జిల్లాలో పరిస్థితులు ఆశాజనకంగా ఉన్నాయని, త్వరలో పలు పరిశ్రమలు వస్తున్నాయన్నారు.  వాల్మీకి కులానికి చెందిన  10, ఇంటర్, డిగ్రీ చదివిన 500 మందికి వారికి వివిధ రంగాల్లో శిక్షణను ఇప్పించి ఉపాధి అవకాశాలను కల్పించేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు.  వాల్మీకులను ఎసీ​‍్ట జాబితాలో చేర్చే అంశంపై రాష్ట్ర ప్రభుత్వం వచ్చే వాల్మీకి జయంతి నాటికి రాష్ట్ర క్యాబినేట్‌లో తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపుతుందనే ఆశాభావాన్ని టీడీపీ రాష్ట్ర కార్యదర్శి బీటీ నాయుడు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జెడ్‌పీ సీఈఓ బీఆర్‌ ఈశ్వర్, బీసీ కార్పొరేషన్‌ ఈడీ కే లాలాలజపతిరావు, ఆర్‌డీఓ రఘుబాబు, డీఆర్‌డీఏ పీడీ రామకృష్ణ,  సాంఘీక సంక్షేమశాఖ డీడీ యు ప్రసాదరావు, బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యదర్శి నక్కలమిట్ట శ్రీనివాసులు, పలు వాల్మీకి సంఘాలకు చెందిన నాయకులు ఎం సుభాష్‌ చంద్రబోస్, పద్మజానాయుడు, వలసల రామక్రిష్ణ, బుర్రా ఈశ్వరయ్య, బాల సంజన్న, గూడూరు గిడ్డయ్య, పులికొండన్న, వెంకటేశ్వర్లు, రామాంజనేయులు, మాదన్న తదితరులు పాల్గొన్నారు.  వాల్మీకి నేత జూటూరు రమణ వాల్మీకి వేషాన్ని ధరించి ఆకట్టుకున్నారు. వీఆర్‌పీఎస్‌ నాయకులు..బీవై రామయ్య..కలెక్టర్‌ విజయమోహన్‌ ను సన్మానించారు. 
 
వాల్మీకిలందరూ నా బంధువులే: ఎస్పీ
జిల్లాలోని 5 లక్షల మంది వాల్మీకులు తన బంధువులేనని జిల్లా ఎస్‌పీ ఆకె రవికృష్ణ అన్నారు. ఫ్యాక‌్షన్‌ గ్రామమైన కప్పట్రాళ్లను దత్తత తీసుకున్న నేపథ్యంలో వాల్మీకులు తనకు చాలా దగ్గరయ్యారన్నారు. వాల్మీకులకు ఎలాంటి కష్టం వచ్చినా తనకు ఫోన్‌ చేయాలని, లేదా తమ కార్యాలయానికి వచ్చి సంప్రదించాలని కోరారు. గతం కంటే ప్రస్తుతం పరిస్థితి ఎంతో మెరుగు పడిందన్నారు.
 
ఎసీ​‍్ట రిజర్వేషన్‌ సాధనతోనే మార్పు: బీవై రామయ్య
వాల్మీకులను ఎసీ​‍్ట జాబితాలో చేరుస్తేనే వారి జీవన స్థితిగతుల్లో మార్పు వస్తుందని వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బీవై రామయ్య అన్నారు. రాష్ట్రంలోని వాల్మీకుల పట్ట ప్రాంతీయ విబేధాలు ఉన్న కారణంగా ఎనిమిది జిల్లాల్లోని వాల్మీకులు విద్య, ఉపాధి, సామాజిక, రాజకీయ తదితర రంగాల్లో పూర్తిగా వెనుకబడి పోయారని ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రి చంద్రబాబు వాల్మీకులను ఎసీ​‍్ట జాబితాలో చేరుస్తామని హామీ ఇచ్చి నేడు నాన్చుడు ధోరణిని అవలంభిస్తున్నారన్నారు. వాల్మీకి ఫెడరేషన్‌కు పాలక వర్గాన్ని ఏర్పాటు చేయకపోవడం వల్ల ప్రత్యేక నిధులు రావడం లేదన్నారు.    
 

Advertisement
 
Advertisement
Advertisement