18న ఆర్బీఐ ఎదుట ధర్నా: ఉత్తమ్‌ | Sakshi
Sakshi News home page

18న ఆర్బీఐ ఎదుట ధర్నా: ఉత్తమ్‌

Published Fri, Jan 13 2017 4:13 AM

18న ఆర్బీఐ ఎదుట ధర్నా: ఉత్తమ్‌ - Sakshi

పెద్ద నోట్ల రద్దుపై కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసన
ఢిల్లీలో దిగ్విజయ్‌తో పీసీసీ నేతల భేటీ


సాక్షి, హైదరాబాద్‌/ న్యూఢిల్లీ: పెద్ద నోట్ల రద్దుకు నిరసనగా ఈ నెల 18న హైదరాబాద్‌ లోని ఆర్బీఐ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్టు పీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి వెల్లడించారు. ఉత్తమ్‌తో పాటు పలువురు పీసీసీ ముఖ్య నేతలు గురువారం ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి దిగ్విజయ్‌సింగ్‌తో సమావేశమ య్యారు. అనంతరం సమావేశం వివరాలను ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి మీడియాకు వెల్లడిం చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో ఈ నెల 18న దేశవ్యాప్తంగా జరిగే ధర్నాల్లో భాగంగా హైదరాబాద్‌లోనూ నిరసనలు చేపట్టనున్నట్టు చెప్పారు. అలాగే ఈ నెల 19న అన్ని జిల్లా కేంద్రాల్లో మహిళా కాంగ్రెస్‌ ఆధ్వర్యంలో నిరసనలు చేపట్టనున్నట్టు వెల్లడించారు. ఈనెల 24 లేదా 25న పెద్ద నోట్ల రద్దుపై జన ఆవేదన సమ్మేళనం పేరిట ఒకరోజు శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. నోట్ల రద్దుతో ప్రజలకు ఎదురవుతున్న ఇబ్బందులు, దేశ ఆర్థిక వ్యవస్థకు జరుగుతున్న నష్టం, దీర్ఘకా లంలో జరిగే ఆర్థిక విపత్తులపై ప్రజలకు అవగాహన కల్పించడానికి కేంద్ర మాజీ మంత్రి సచిన్‌ పైలట్‌ ముఖ్యఅతిథిగా ఈ సమ్మేళనం జరుగుతుందని ఉత్తమ్‌ తెలిపారు.

ఇందిర శత జయంతి ఉత్సవాలకు మన్మోహన్‌సింగ్‌...
ఫిబ్రవరిలో జరిగే ఇందిరాగాంధీ శత జయంతి ఉత్సవాలకు మాజీ ప్రధానమంత్రి మన్మోహన్‌సింగ్‌ను రాష్ట్రానికి ఆహ్వానిస్తున్నా మని ఉత్తమ్‌ చెప్పారు. దీనికి ఇంకా తేదీని నిర్ణయించలేదని తెలిపారు. దిగ్విజయ్‌ సింగ్‌తో జరిగిన సమావేశంలో పొన్నాల లక్ష్మయ్య, వి.హన్మంతరావు, సర్వే సత్య నారాయణ, రేణుకా చౌదరి, పాల్వాయి గోవర్ధన్‌రెడ్డి, మల్లు రవి, మృత్యుంజయం, తాహెర్‌బిన్‌ తదితరులు పాల్గొన్నారు.  

భయపడకండి..  కాంగ్రెస్‌ అండగా ఉంటుంది: రాహుల్‌
జన ఆవేదన సమ్మేళన్‌లో పాల్గొన డానికి ఢిల్లీ వెళ్లిన తెలంగాణ కాంగ్రెస్‌ నేతలు గురువారం పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీతో సమావేశమయ్యారు. పీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, పొన్నాల లక్ష్మయ్య, షబ్బీర్‌అలీ, రేణుకాచౌదరి, వీహెచ్, దానం నాగేందర్‌ మరికొందరు ముఖ్య నేతలు  రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై చర్చించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరుతో ప్రజల్లో అభద్రత నెలకొందని, ‘డరో మత్‌’ (భయ పడకండి) అని వారిలో మనోస్థైర్యాన్ని నింపాలని రాహుల్‌ ఈ సందర్భంగా వారికి ఉద్బోధ చేసినట్టు సమాచారం. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడుతూ నోట్ల రద్దు విషయంలో ప్రధాని మోదీ నిర్ణయంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రధా ని చెప్పిన 50 రోజుల గడువు పూర్తయినా ప్రజల కష్టాలు తీరకపోవడం తో తెలంగాణలో ఆందోళన ఉధృతం చే యాలని నిర్ణయించామన్నారు. రబీ పంట కు కనీస మద్దతు ధరను 20శాతం అద నంగా ఇవ్వాలని, చిన్న వ్యాపారులకు పన్నుల్లో 50 శాతం రాయితీ ఇవ్వాలని, ఒక్కో కుటుంబంలో ఒక మహిళ అకౌం ట్‌లో రూ.50 వేలు డిపాజిట్‌ చేయాలని ఉత్తమ్‌ డిమాండ్‌ చేశారు.

Advertisement
Advertisement