చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ | two arrest of theft case | Sakshi
Sakshi News home page

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

Jun 27 2017 10:49 PM | Updated on Aug 25 2018 6:21 PM

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌ - Sakshi

చోరీ కేసులో ఇద్దరు నిందితుల అరెస్ట్‌

ఉరవకొండ పట్టణం రంగావీధిలోని వ్యాపారి ఎర్రిస్వామి ఇంట్లో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ చోరీ కేసులో నిందితులైన వెలిగొండ ఎణ్ణప్ప, పులి రమేష్‌లను గుంతకల్లు రోడ్డులో అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌చార్జ్‌ సీఐ గుర్నాథ్‌బాబు, ఎస్‌ఐ నగేష్‌బాబు మంగళవారం తెలిపారు.

ఉరవకొండ : ఉరవకొండ పట్టణం రంగావీధిలోని వ్యాపారి ఎర్రిస్వామి ఇంట్లో నాలుగు నెలల క్రితం జరిగిన ఓ చోరీ కేసులో నిందితులైన వెలిగొండ ఎణ్ణప్ప, పులి రమేష్‌లను గుంతకల్లు రోడ్డులో అరెస్ట్‌ చేసినట్లు ఇన్‌చార్జ్‌ సీఐ గుర్నాథ్‌బాబు, ఎస్‌ఐ నగేష్‌బాబు మంగళవారం తెలిపారు. అప్పట్లో రూ.20వేల నగదు, జత బంగారు కమ్మలు, ఉంగరం చోరీ అయ్యిందన్నారు. నిందితుల నుంచి బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. పరారీలో ఉన్న నిందితుడి అరెస్ట్‌ అక్రమంగా తపంచా కలిగి ఉన్న కేసులో నిందితుడిగా ఉంటూ పరారీలో ఉన్న డ్రైవర్స్‌ కాలనీ మహబూబ్‌సాహెబ్‌ కుమారుడు వన్నూరుసాబ్‌ను చెన్నైలో అరెస్ట్‌ చేసి ఉరవకొండకు తీసుకొచ్చినట్లు ఎస్‌ఐ నగేష్‌బాబు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement