లారీ ఢీకొన్న శబ్దంతో ఆగిన డ్రైవర్ గుండె | truck driver dies of heart attack after hearing heavy sound | Sakshi
Sakshi News home page

లారీ ఢీకొన్న శబ్దంతో ఆగిన డ్రైవర్ గుండె

Sep 28 2015 12:54 PM | Updated on Sep 3 2017 10:08 AM

లారీ ఢీకొన్న శబ్దంతో ఆగిన డ్రైవర్ గుండె

లారీ ఢీకొన్న శబ్దంతో ఆగిన డ్రైవర్ గుండె

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ స్టీరింగ్‌పైనే కన్నుమూశాడు.

కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నం సమీపంలో సోమవారం జరిగిన ప్రమాదంలో లారీ డ్రైవర్ స్టీరింగ్‌పైనే కన్నుమూశాడు. వివరాలివీ.. విజయవాడ గుంటుపల్లిలోని సింగ్‌నగర్‌కు చెందిన ఇబ్రహీం లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. సోమవారం ఉదయం ఇబ్రహీంపట్నంలోని ఇసుక క్వారీ దగ్గరకు తన లారీతో వచ్చాడు.

లారీని హైవే పక్కన క్యూలో పెట్టేందుకు రివర్స్ చేస్తున్నాడు. అయితే, అది ప్రమాదవశాత్తు వెనుక ఉన్న మరో లారీని ఢీకొనటంతో పెద్ద శబ్దం వచ్చింది. దీంతో ఒక్కసారిగా గాభరాకు గురైన ఇబ్రహీం గుండెపోటుతో స్టీరింగ్‌పైనే కుప్పకూలాడు. ఆయనకు గతంలో కూడా రెండుసార్లు గుండెపోటు వచ్చిందని తోటివారు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement