నేటి నుంచి రెండో దఫా కౌన్సెలింగ్‌ | today onwards second councelling of btech | Sakshi
Sakshi News home page

నేటి నుంచి రెండో దఫా కౌన్సెలింగ్‌

Jul 19 2017 10:41 PM | Updated on Sep 5 2017 4:24 PM

ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌన్సెలింగ్‌ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కేశవచంద్ర తెలిపారు.

జేఎన్‌టీయూ: ఇంజినీరింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి రెండో దఫా కౌన్సెలింగ్‌ గురువారం నుంచి ప్రారంభం కానున్నట్లు ప్రభుత్వ  పాలిటెక్నిక్‌ కళాశాల ప్రిన్సిపల్‌  డాక్టర్‌ కేశవచంద్ర తెలిపారు.  ప్రభుత్వ పాలిటెక్నిక్‌ కళాశాల, అనంతపురం, ఎస్కేయూ హెల్ప్‌లైన్‌ కేంద్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావచ్చన్నారు. 22వ తేదీతో కౌన్సెలింగ్‌ ముగుస్తుందన్నారు. ఇప్పటికే తొలి దఫా ఇంజినీరింగ్‌ కౌన్సెలింగ్‌లో సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరైనవారు, రెండో దఫా సర్టిఫికెట్ల పరిశీలనకు హాజరుకావాల్సిన అవసరం లేదన్నారు. అవసరం అనుకుంటే   కేవలం వెబ్‌ ఆప్షన్లు మాత్రమే మార్చుకోవచ్చునని సూచించారు.  22 వరకు వెబ్‌ ఆప్షన్లు ఇవ్వడానికి షెడ్యూల్‌ను నిర్ధేశించారని పేర్కొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement