పోలీస్‌స్టేషన్ నుంచి దొంగ పరారీ | Thief escapes from kamareddy police station | Sakshi
Sakshi News home page

పోలీస్‌స్టేషన్ నుంచి దొంగ పరారీ

Nov 5 2016 11:21 AM | Updated on Sep 4 2017 7:17 PM

పోలీస్‌స్టేషన్ నుంచి దొంగ పరారీ

పోలీస్‌స్టేషన్ నుంచి దొంగ పరారీ

దొంగతనం కేసులో అరెస్టైన ఓ దొంగ పోలీసుల కన్నుగప్పి బేడీలతో సహా పరారయ్యాడు.

కామారెడ్డి: దొంగతనం కేసులో అరెస్ట్ చేసి తీసుకొచ్చిన ఓ దొంగ పోలీసుల కన్నుగప్పి బేడీలతో సహా పరారయ్యాడు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు అతన్ని వెంబడించి పట్టుకున్నారు. ఈ సంఘటన కామారెడ్డి పోలీస్‌స్టేషన్‌లో శనివారం చోటుచేసుకుంది.

ఓ దొంగతనం కేసులో అరెస్టైన రంజాన్ అనే వ్యక్తి, పోలీసులు ఆదమరిచి ఉండటాన్ని గమనించి చల్లగా స్టేషన్ నుంచి జారుకున్నాడు. ఇది గుర్తించిన పోలీసులు అతన్ని తిరిగి పట్టుకొని స్టేషన్‌కు తీసుకొచ్చారు.

Advertisement
 
Advertisement
Advertisement