36 చోరీ కేసుల్లో నిందితులు అరెస్టు
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 36 చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురిని విజయవాడ సీసీఎస్ ఇంటిలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ప్రముఖ గ్యాంగులకు చెందిన వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 1.6 కిలోల బంగారు నగలు, 5.25 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ పాల్‌రాజ్ గురువారం విలేకరులకు వెల్లడించారు.
పట్టుపడిన తెల్లపాముల,
పార్థు గ్యాంగ్ సభ్యులు
1.6 కిలోల బంగారు
నగలు, 8.25 కిలోల వెండి వస్తువులు స్వాధీనం
విజయవాడ :
నగరంలోని వివిధ ప్రాంతాల్లో జరిగిన 36 చోరీ కేసుల్లో నిందితులైన ఆరుగురిని విజయవాడ సీసీఎస్ ఇంటిలిజెన్స్ పోలీసులు అరెస్టు చేశారు. దేశంలో ప్రముఖ గ్యాంగులకు చెందిన వీరి నుంచి రూ.50 లక్షల విలువైన 1.6 కిలోల బంగారు నగలు, 5.25 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులకు సంబంధించిన వివరాలను పోలీస్ కమిషనరేట్‌లో క్రైం డీసీపీ పాల్‌రాజ్ గురువారం విలేకరులకు వెల్లడించారు. ఆయన కథనం మేరకు..
తెల్లపాముల గ్యాంగ్‌గా పేరుపొంది న పశ్చిగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన దాసరి పేతురు, మింగి ఎర్రబాబు, దాసరి రంగరావు, దాసరి ఏసురత్నం బంధువులు. వారిపై కాకినాడ, తాడేపల్లిగూడెం, ఏలూరులో పలుదొంగతనాల కేసులు ఉన్నాయి. వీరిలో ఎర్రబాబుపై హత్యకేసు కూడా ఉంది. వారందరు కలిసి విజయవాడ, ఏలూరులో పగటిపూట చిత్తుకాగితాలు ఏరుకునే వారిగా నటిస్తూ కొన్ని ఇళ్లను గుర్తించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతుంటా రు. విజయవాడలో మొత్తం 23 చోరీలు చేశారు. 2009లో ఉంగుటూరులో ఒకటి, 2013లో విజయవాడ పటమటలో రెండు, 2014లో ఊయ్యూర ఒక చోరీచేశారు. 2015లో మాచవరం ఏరి యాలో రెండు, గన్నవరం ఏరియాలో రెండు, పెనమలూరు, ఉయ్యూరు, కంకిపాడులో మూడు చొప్పున చోరీలు చేశారు. 2016లో ఏలూరు, ఉయ్యూరు, కంకిపాడు, పెనమలూరులో రెండేసి, ఉంగుటూరు, గన్నవరం, మాచవరం, తోట్లవల్లూరులో ఒక్కొక్కటి చొప్పున చోరీలు చేశారు. నిందితులు ఒన్‌టౌన్ కాలేశ్వరరావు మార్కెట్ సమీపంలో చోరీ చేసిన బంగారు నగలను విక్రయించేం దుకు ప్రయత్నిస్తుండగా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. వారినుంచి 23 చోరీలకు సంబంధించి రూ.25 లక్షల విలువైన 810 గ్రామలు బంగారు ఆభరణాలు, నాలుగు కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు.
మధ్యప్రదేశ్‌కు చెందిన పార్థు గ్యాంగ్
మధ్యప్రదేశ్‌లో పార్థు గ్యాంగ్‌గా పేరు పొందిన ఇద్దరు పాత నేరస్తులను కూడా సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు. ప్రేమ్ సింగ్ అలియాస్ బాబు సింగ్ మోగియా అలియాస్ బాబూ ప్రేమ్, బీర్‌సింగ్ విజయవాడ రాజీవ్ గాంధీ పార్కు సమీపంలో అనుమానాస్పదంగా తిరుగుతుండగా సీసీఎస్ పోలీసులు పట్టుకుని విచారించారు. నిందితులు ఇద్దరు రేండేళ్లుగా విజయవాడ వచ్చి వెళ్తూ పగలు రెక్కీ నిర్వహించి రాత్రిపూట చోరీలకు పాల్పడుతున్నారు. 2014లో వెటర్నరీ కాలనీ, పటమట లక్షీపతికాలనీ, మాచవరం ఓల్డ్ ఎస్‌బీఐ కాలనీలో చోరీలకు పాల్పడి, దొరికిన సొమ్ముతో మధ్యప్రదేశ్ వెళ్లిపోయారు. 2015, 2016లో విజయవాడ వచ్చి కంకిపాడు, గుడివాడ, పటమట కోనేరువారి వీధిలో, మాచవరం ఏరియా కార్మికనగర్, పెనమలూరు సమీపంలో యనమలకుదురులో మొత్తం 13 దొంగతనాలకు పాల్పడ్డారు. వారు మరో సారి చోరీ చేసేందుకు విజయవాడ రాగా పోలీసులు అనుమానించి పట్టుకున్నారు. వారి వద్ద రూ.25 లక్షలు విలువైన 800 గ్రామలు బంగారు ఆభరణాలు, 4.25 కిలోల వెండి వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమాశంలో విజయవాడ క్రై ఏడీసీపీ రామకోటేశ్వరరావు, ఏసీపీలు వర్మ, పోతురాజు తదితరులు పాల్గొన్నారు.