
నగరంలో భారీ చోరీ
నగరంలోని ఆర్టీసీబస్టాండు సమీపంలో రాజహంస అపార్టుమెంట్ వెనుక భారీ చోరీ జరిగింది.
అనంతపురం సెంట్రల్ : నగరంలోని ఆర్టీసీబస్టాండు సమీపంలో రాజహంస అపార్టుమెంట్ వెనుక భారీ చోరీ జరిగింది. తాళం వేసిన ఇంటికి కన్నం వేసి రూ. 16 తులాల బంగారు, రూ.1.50 లక్షల నగదు దోచుకెళ్ళారు. వివరాల్లోకి వెలితే... సహకారశాఖలో పనిచేస్తున్న శ్రీనివాసులు, భారతీ దంపతులు శ్రీనివాసనగర్‌లో నివాసముంటున్నారు. రెండురోజుల క్రితం మదనపల్లెలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు.
మంగళవారం సాయంత్రం ఊరి నుంచి తిరిగొచ్చారు. అప్పటికే ఇంటి తలుపులు పగలగొట్టి ఉండడంతో లోనికెళ్లి చూడగా బీరువా తలుపులు కూడాతెరిచి ఉన్నాయి. దొంగతనం జరిగిందని భావించిన బాధితులు వెంటనే త్రీటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. రంగంలోకి దిగిన పోలీసులు క్లూస్‌టీంను రప్పించి పరిశీలించారు. బీరువాలో దాచుకున్న 16 తులాల బంగారు నగలు, లక్షన్నర నగదును దోచుకెళ్లారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.