పవర్ ఆఫీస్ నుంచి నగరంలోనికి వెళ్లే విద్యుత్ లైన్ స్తంభాన్ని శంక రాపురం పెట్రోల్ బంక్ వద్ద రాత్రి సమయం లో లారీ ఢీకొంది.
► విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న లారీ
►సరఫరా నిలిచిపోయిన వైనం
►ఉక్కపోతకు అల్లాడిన నగరవాసులు
కడప: శంకరాపురం పవర్ ఆఫీస్ నుంచి నగరంలోనికి వెళ్లే విద్యుత్ లైన్ స్తంభాన్ని శంక రాపురం పెట్రోల్ బంక్ వద్ద మంగళ వారం రాత్రి 10 గంటల సమయం లో లారీ ఢీకొంది. దీంతో నగరం లోని సబ్‌స్టేషన్‌లన్నింటికీ విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. సుమారు గంటన్నర పాటు నగరంలో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. కాగా విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని యుద్ధప్రాతిపదికన తా త్కాలికంగా స్తంభాన్ని ఏర్పాటు చేసి విద్యుత్ సరఫరా పునరుద్ధరణకు చర్యలు చేపట్టారు. సుమారు రెండు గంటల పాటు విద్యుత్ లేకపో వడంతో ఉక్కకు నగరవాసులు అల్లాడారు. ముఖ్యంగా చంటి బిడ్డలు, వృద్ధులు ఇబ్బందులు పడ్డారు.