మానుకోట జిల్లా ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. రెండు నెలల్లోపే జిల్లా ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు ప్రకటన మాత్రమే అధికారికంగా మిగిలి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం తొలుత అన్వేషణ ప్రారంభించారు.
మానుకోట జిల్లా పనులు ముమ్మరం
Aug 11 2016 12:51 AM | Updated on Sep 4 2017 8:43 AM
మహబూబాబాద్ : మానుకోట జిల్లా ఏర్పాటు పనులను అధికారులు వేగవంతం చేశారు. ఇందుకు సంబంధించిన నివేదికలను కూడా సిద్ధం చేసి అధికారులకు అందజేశారు. రెండు నెలల్లోపే జిల్లా ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు. మానుకోట జిల్లా ఏర్పాటు ప్రకటన మాత్రమే అధికారికంగా మిగిలి ఉంది. ప్రభుత్వ కార్యాలయాల భవనాల కోసం తొలుత అన్వేషణ ప్రారంభించారు.
ఇందులో భాగంగానే జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రశాంత్ జీవన్‌పాటిల్ కొద్ది రోజుల క్రితం మానుకోటకు వచ్చి పలు ప్రభుత్వ భవనాలను పరిశీలించారు. ఇందిరానగర్ కాలనీ సమీపంలోని వైటీసీ (యూత్ ట్రైనింగ్ సెంటర్) భవనం కలెక్టరేట్‌కు అనుకూలంగా ఉన్నట్లు అధికారులు నిర్ధారణకు వచ్చారు. ఆ కలెక్టరేట్ ప్రధాన రహదారి కోసం సుమారు 18 లక్షలను కేటాయించి పనులు చేపట్టారు. ఓ ప్రైవేట్ సంస్థకు వైటీసీ భవనాన్ని అప్పగించినట్లు ఉత్తర్వులు వచ్చాయని మానుకోట ఏటీటీడబ్ల్యూఓ దేశీరాంనాయక్ తెలిపారు. తక్షణమే ఆ భవనంలో కొనసాగుతున్న గిరిజన బాలుర ఆశ్రమ పాఠశాలను వేరే భవనంలోకి మార్చాలని ఆదేశించారు. ఈ విషయమై వెంటనే స్పందించిన రెవెన్యూ ఉన్నతాధికారులు.. ఐటీడీఏ అధికారులతో మాట్లాడి ఆ భవనాన్ని కలెక్టర్ కార్యాలయానికి కేటాయించారని వివరించారు.
మానుకోటలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలను పరిశీలించామని, ఆయా భవనాల్లో జిల్లా కార్యాలయాలకు సంబంధించిన పూర్తి వివరాలను కలెక్టర్‌కు అందజేసినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కార్యాలయాల భవనాల నిర్మాణం కోసం పట్టణంలోని పలు ప్రాంతాలను సర్వే చేయడం పూర్తయ్యిందని, ఆ నివేదికను కూడా అందజేసినట్లు అధికారులు తెలిపారు. ముఖ్యంగా జిల్లా కలెక్టర్ కార్యాలయం మాత్రం ప్రధాన రహదారికి దగ్గరలో ఉండే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. వైటీసీ భవనమే కలెక్టరేట్‌కు కేటాయించాలని అధికారులు దాదాపు నిర్ధారణకు వచ్చారు. తాత్కాలిక కార్యాలయాల ఏర్పాట్లు కూడా పూర్తి అయినట్లు రెవెన్యూ అధికారులు చెబుతున్నారు.
Advertisement
Advertisement