ఆత్మకూర్(నర్వ) : అమరచింతలోని శివాజీనగర్‌లో సోమవారం రాత్రి క్షద్రపూజలు నిర్వహించి రక్తాన్ని పరిసరాల్లో చల్లారనే పుకార్లు మంగళవారం తెల్లవారుజామున వినిపించా యి. దీంతో గ్రామస్తులు శివాజీనగర్‌లోని ఆ ప్రదేశానికి తరలివచ్చారు. ఎస్‌ఐ సీహెచ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.
అమరచింతలో కలకలం
Jul 26 2016 11:39 PM | Updated on Sep 4 2017 6:24 AM
ఆత్మకూర్(నర్వ) : అమరచింతలోని శివాజీనగర్‌లో సోమవారం రాత్రి క్షద్రపూజలు నిర్వహించి రక్తాన్ని పరిసరాల్లో చల్లారనే పుకార్లు మంగళవారం తెల్లవారుజామున వినిపించా యి. దీంతో గ్రామస్తులు శివాజీనగర్‌లోని ఆ ప్రదేశానికి తరలివచ్చారు. ఎస్‌ఐ సీహెచ్ రాజు సంఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు. శివాజీనగర్‌లో జన్ను నాగరాజు ఇంట్లో అద్దెకు ఉంటున్న గాజుల ఖాజా పై అనుమానంతో విచారించారు. ఖాజా తన భార్య అనారోగ్యానికి గురైన నేపథ్యంలో ఇంట్లో దిష్టి తీసే పనులకు తన బావమరుదులను పిలిపించుకున్నట్లు తెలిపారు. అయితే కోసిన కోళ్ల రక్తంతో పాటు కోడి తలకాయలు, పేగులను కుండలో ఉడకబెట్టి కుంకుమ, పసుపును చల్లి దిష్టితీసిన అనంతరం వాటిని దూరప్రాంతానికి విసిరివేయడానికి వెళ్తుండగా పొరపాటున చేయి జారి కుండ పలిగిపోయిందని ఎస్‌ఐకి తెలిపాడు. రాత్రివేళ ఆ ప్రదేశాన్ని నీటితో కడిగామని తెలిపాడు. అయితే కాలనీవాసులు మాత్రం క్షుద్ర పూజలు జరిపి గుప్తనిధులను తీయడానికి ప్రయత్నించి ఉంటారని అనుమానం వ్యక్తం చేయగా ఖాజా ఇంటికి వచ్చిన నఫీజ్ పాష, మక్సూద్ అహ్మద్, సులేమాన్‌ను పోలీస్‌స్టేçÙన్‌కు తరలించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు వెల్లడించి చర్యలు తీసుకుంటామని ఎస్‌ఐ తెలిపారు.
Advertisement
Advertisement