పది పరీక్షలు ప్రారంభం | tenth exams started | Sakshi
Sakshi News home page

పది పరీక్షలు ప్రారంభం

Mar 18 2017 12:00 AM | Updated on Sep 26 2018 3:25 PM

పది పరీక్షలు ప్రారంభం - Sakshi

పది పరీక్షలు ప్రారంభం

భానుగుడి (కాకినాడ): తమ జీవితంలో తొలి పబ్లిక్‌ పరీక్షను పదో తరగతి విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తోడురాగా ఆత్మస్థైర్యంతో పరీక్షా కేంద్రాలవైపు అడుగులు వేశారు.జిల్లాలో 304 కేంద్రాల్లో శుక్రవారం నుంచి ప్రారభమైన ఈ పరీక్షల

99.7 శాతం హాజరు
భానుగుడి (కాకినాడ): తమ జీవితంలో తొలి పబ్లిక్‌ పరీక్షను పదో తరగతి విద్యార్థులు ఎదుర్కొన్నారు. ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సన్నిహితులు తోడురాగా ఆత్మస్థైర్యంతో పరీక్షా కేంద్రాలవైపు అడుగులు వేశారు.జిల్లాలో 304 కేంద్రాల్లో శుక్రవారం నుంచి ప్రారభమైన ఈ పరీక్షలకు 67,148 మంది విద్యార్థులకు 66,929 మంది హాజరయ్యారు. 219 మంది గైర్హాజరయ్యారు. తొలి పరీక్షలో 99.7 శాతం విద్యార్థులు హాజరైనట్టు డీఈవో అబ్రహం తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో అబ్రహం,  అబ్జర్వర్‌ వవజాక్షి జిల్లాలో పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన 15 స్క్వాడ్‌ బృందాలు ఆకస్మిక తనిఖీలతో హడలెత్తించాయి. 
 
 

Advertisement
 
Advertisement
Advertisement