పంపాదిపేటలో ఉద్రిక్తత | tension in east godavari district pampa dipeta | Sakshi
Sakshi News home page

పంపాదిపేటలో ఉద్రిక్తత

Aug 29 2016 10:44 AM | Updated on Sep 4 2017 11:26 AM

దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన పంపాదిపేట వాసులను అరెస్ట్ చేయడానికి పోలీసులు ప్రయత్నించారు.

తొండంగి: తూర్పు గోదావరి జిల్లా తొండంగి మండలం కోన తీరప్రాంతంలో దివీస్ లేబొరేటరీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ పరిసర గ్రామాల రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆదివారం దివీస్ పరిశ్రమ ఏర్పాటును వ్యతిరేకిస్తూ ఆందోళనలు చేపట్టిన పంపాదిపేట వాసులను అరెస్ట్ చేయడానికి ఇవాళ పోలీసులు ప్రయత్నించారు. దీంతో గ్రామస్తులు పోలీసు వాహనాలను అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, గ్రామస్తులకు మధ్య జరిగిన తోపులాటలో ఇద్దరికి గాయాలయ్యాయి.
 

Advertisement
 
Advertisement
Advertisement