టెన్నిస్‌ పోరు.. హుషారు | tennis fight.. enjoy | Sakshi
Sakshi News home page

టెన్నిస్‌ పోరు.. హుషారు

Nov 17 2016 12:35 AM | Updated on Sep 4 2017 8:15 PM

భీమవరం :పట్టణంలోని యూత్‌ కల్చరల్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు బుధవారం రసవత్తరంగా సాగాయి.

భీమవరం :పట్టణంలోని యూత్‌ కల్చరల్‌ అసోసియేషన్‌  ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాతీయ స్థాయి టెన్నిస్‌ టోర్నమెంట్‌ పోటీలు బుధవారం రసవత్తరంగా సాగాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన టెన్నిస్‌ క్రీడాకారులు ప్రత్యర్థులపై విజయం సాధించడానికి రాకెట్లను ఝుళిపిస్తూ హోరాహోరీగా పోరాడారు. బుధవారం నాటి పోటీల్లో విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. 
మెన్‌స క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో.. 
తమిళనాడుకు చెందిన రశిశంకర్‌ సత్యరాజ్‌ అదే రాష్ట్రానికి చెందిన విజయ్‌ కన్నన్‌ పై 4–6, 6–3, 7–5 తేడాతో విజయం సాధించారు. తమిణనాడుకు చెందిన వీఎఎం రంజిత్‌ అదే రాష్ట్రానికి చెందిన ఫహద్‌ మహ్మద్‌పై 6–2, 4–6, 6–4 తేడాతో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బైరెడ్డి సాయి చరణ్‌ రెడ్డి కర్నాటకకు చెందిన ప్రజ్వాల్‌ ఎస్‌డీ దేవ్‌పై 2–6, 7–6, 6–4 తేడాతో విజయం సాధించగా, తమిళనాడుకు చెందిన వినోద్‌ శ్రీధర్‌ అదే రాష్ట్రానికి చెందిన ఓజెస్‌ జె త్యేజోపై 6–3, 6–4 తేడాతో విజయం సాధించారు. 
ఉమెన్‌ స క్వార్టర్స్‌ ఫైనల్స్‌లో.. 
తమిళనాడుకు చెందిన వాసవీ గణేశన్‌ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన దేవరకొండ లలితపై 6–2, 2–1 తేడాతో, తమిళనాడుకు చెందిన సహజ యమలపల్లి కర్నాటకు చెందిన ఎస్‌బీ అపూర్వపై 6–2, 6–1 తేడాతో, తెలంగాణకు చెందిన సామా సాత్విక తమిళనాడుకు చెందిన అక్షయ సురేష్‌పై 6–1, 6–0 తేడాతో, ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కల్వ భువన తమిళనాడుకు చెందిన బాబురాజ్‌ నిత్యరాజ్‌పై 6–4, 7–5 తేడాతో విజయం సాధించారు.
మెన్‌ స డబుల్స్‌ 
ప్రీ క్వార్టర్స్‌ ఫైన్సల్‌లో.. 
బైరెడ్డి సాయిచరణ్‌ రెడ్డి, ప్రజ్వాల్‌ ఎస్‌డీ దేవ్‌లు టి.అఖిలేష్‌రెడ్డి, కె.ఆశీష్‌ ఆనంద్‌పై 6–3, 6–0 తేడాతో విజయం సాధించగా, అంకం కృష్ణ తేజ, హిమకేష్‌ ఎస్‌.దుర్గలు కోసరాజు శివదీప్, అజయ్‌పృథ్వీపై 6–3, 6–2 తేడాతో, రోహన్‌  భాటియా, ఓజెస్‌ జె.త్యేజోలు మాచర్ల త్రినాథ్‌ శశాంక్, దేవ్‌ ఉత్యపై 6–4, 6–2 తేడాతో, డి.పగలవన్, అభివీర్‌ షెకావత్‌లు రవిశంకర్‌ సత్యరాజ్, రిత్విక్‌ ఆనంద్‌లపై 6–7, 7–6, 10–8 తేడాతో, పొన్నాల సిద్ధార్ధ్‌ జై.సోనిలు అమిత్‌ బజాద్, నిఖిలేష్‌ కనోజియాపై 6–2, 6–2 తేడాతో విజయం సాధించారు.
ఉమెన్‌ స డబుల్స్‌ 
ప్రీ క్వార్టర్స్‌ ఫైన్సల్‌లో.. 
రామినేని భవ్య, శివాని ఎస్‌.శ్రీసాయిలు జంగం సింధు, కొండవీటి అనూషాపై 6–3, 7–6 తేడాతో విజయం సాధించగా, కల్వ భువన, బాబురాజ్‌ నిత్యరాజ్‌లు ప్రగతి నారాయణ ప్రసాద్, ప్రతిభా నారాయణ ప్రసాద్‌లపై 6–0, 7–5 తేడాతో, లలిత దేవరకొండ వాసవీ గణేషన్‌ లు శ్వేత నలేకల, అమరిన్‌  నాజ్‌లపై 6–4, 6–1తేడాతో విజయం సాధించారు.  
 
 
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement