తల్లి కోసం గుడికట్టిన కుమారులు | temple constructed for mother | Sakshi
Sakshi News home page

తల్లి కోసం గుడికట్టిన కుమారులు

Sep 18 2016 8:56 PM | Updated on May 25 2018 5:57 PM

ఆశ్రమంలో తల్లి ప్రతిమకు పూజలు చేస్తున్న కుమారులు - Sakshi

ఆశ్రమంలో తల్లి ప్రతిమకు పూజలు చేస్తున్న కుమారులు

తల్లి ప్రతిమను రూపొందించి, ప్రత్యేక పూజలు చేస్తున్న కుమారుల సంగతి దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొలుగూరి రాజమణి గతేడాది అనారోగ్యంతో మరణించింది.

దుబ్బాక: తల్లి ప్రతిమను రూపొందించి, ప్రత్యేక పూజలు చేస్తున్న కుమారుల సంగతి దుబ్బాక మండలం గోసాన్‌పల్లిలో వెలుగుచూసింది. గ్రామానికి చెందిన కొలుగూరి రాజమణి గతేడాది అనారోగ్యంతో మరణించింది. దీంతో భర్త చంద్రాగౌడ్, కుమారులు రాజేందర్, శంకర్, కూతురు రేణుక కలిసి రాజమణి ప్రతిమను  వ్యవసాయ క్షేత్రంలో ప్రతిష్టించారు. ప్రతిమను ప్రతిష్టించి ఏడాది అవుతున్న  సందర్భంగా ఆశ్రమంలో యజ్ఞ హోమాలు, ప్రత్యేక పూజలు చేసి ప్రజలకు అన్నదానం చేపట్టి మానవ సంబంధాలకు మారు పేరుగా నిలుస్తున్నారు.

ప్రతి ఏడాది రాజమణి పేరున ప్రజలకు ధాన ధర్మాలు, అన్నదాన కార్యక్రమాన్ని చేపడుతామని నిర్వాహకులు తెలిపారు. తమ అమ్మను ప్రతి రోజు గుర్తుంచుకునే విధంగా ఆమె పేరున సేవా కార్యక్రమాలు చేపడతామని కుమారులు తెలిపారు.  కార్యక్రమంలో బంధు మిత్రులు నాగవ్వ నర్సాగౌడ్, కళావతి నారాగౌడ్, సుగుణ చంద్రాగౌడ్, సుధా వెంకట్‌ గౌడ్, కళావతి పాపయ్య, లక్ష్మి భూమా గౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement