టెక్‌ మహీంద్రా ఉద్యోగి దుర్మరణం | tech mahindra employee killed in road accident | Sakshi
Sakshi News home page

టెక్‌ మహీంద్రా ఉద్యోగి దుర్మరణం

Jul 29 2017 8:47 AM | Updated on Sep 5 2017 5:10 PM

కృష్ణాజిల్లా నందిగామ వద్ద హైవేపై ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు.

నందిగామ: కృష్ణాజిల్లా నందిగామ వద్ద హైవేపై శనివారం జరిగిన ప్రమాదంలో ఓ యువకుడు దుర్మరణం చెందాడు. స్పోర్ట్సు బైక్‌ ఇంజన్‌ జామ్‌ కావడంతో ఆ వాహనంపై ఉన్న ఇద్దరు యువకులు కిందపడిపోయారు. అదే సమయానికి వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం వీరిని ఢీకొనడంతో నాగేంద్రరావు అనే యువకుడు అక్కడికక్కడే మృతి చెందాడు.

వంశీకృష్ణ అనే మరో యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. వీరిద్దరు టెక్‌ మహీంద్రా ఉద్యోగస్తులు. కాగా హెల్మెట్‌ ఉన్నా బలంగా ఢీ కొనడంతో నాగేంద్రరావు మృతి చెందాడు. మృతుడి స్వస్థలం తాడేపల్లిగూడెం కాగా వంశీకృష్ణది విజయవాడలోని  కృష్ణలంక అని తెలుస్తోంది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement