పశ్చిమగోదావరి జిల్లాలో అధికార టీడీపీ నాయకులు ఆగడాలు మితిమీరుతున్నాయి.
ఏలూరు: పశ్చిమగోదావరి జిల్లాలో అధికార టీడీపీ నాయకులు ఆగడాలు మితిమీరుతున్నాయి. అధికారం ఉందన్న అహంకారంతో ఇసుక దందా చేస్తున్నారు. తమకు అడ్డువచ్చిన వారిపై బెదిరింపులకు దిగుతున్నారు. టెండర్లు వెనక్కు తీసుకోవాలంటూ కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నారు.
జెడ్మీ చైర్మన్ రాజు, ఎమ్మెల్యే శేషారావు సిండికేట్లతో ఫోన్లు చేయిస్తున్నట్టు ఆరోపణలు వస్తున్నాయి. టెండర్లు ఉపసంహరించుకోవాలని అధికార పార్టీ నేతల నుంచి ఒత్తిళ్లు వస్తున్నాయని జిల్లా కలెక్టర్, ప్రభుత్వ కార్యదర్శులకు కాంట్రాక్టర్లు మొరపెట్టుకున్నారు. టీడీపీ నేతల బారి నుంచి తమకు రక్షణ కల్పించాలని విజ్ఞప్తి చేశారు.