మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు.
శింగనమల :
మధ్యాహ్న భోజన ఏజెన్సీ కోసం తెలుగు తమ్ముళ్లు కొట్టుకున్నారు. మండల పరిధిలోని నాగులగుడ్డం తాండాకు సంబంధించి మధ్యాహ్న భోజన ఏజెన్సీపై కొద్దిరోజులుగా వివాదం నడుస్తోంది. గ్రామస్థాయి టీడీపీ నాయకులు తమకు కావాలంటే తమకు కావాలని పోటీ పడ్డారు.
ఇందులో భాగంగానే సమస్యను ఎమ్మెల్యే దృష్టికి తీసుకెళ్లాలని భావించి అనంతపురంలో ఉన్న ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసు దగ్గరకు వెళ్లారు. అయితే ప్రజాప్రతినిధులు లేకపోవడంతో ఓ టీడీపీ నాయకుని వద్ద సమస్యను చర్చించారు. మాటా మాటా పెరగడంతో ఘర్షణకు దిగారు.
అక్కడే ఉన్న నాయకులు, కార్యకర్తలు వారిని విడిపించి అక్కడి నుంచి పంపించివేశారు. విషయం తెలుసుకున్న వన్‌టౌన్ పోలీసులు అక్కడికి చేరుకునేలోపే తమ్ముళ్లు వెళ్లిపోయారు.