
ప్రజాధనం లూటీలో టీడీపీ ఫస్ట్
ప్రజాధనం లూటీ చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రథమస్థానంలో నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్
బద్వేలు ప్లీనరిలో వైఎస్ వివేకానందరెడ్డి
బద్వేలు: ప్రజాధనం లూటీ చేయడంలో తెలుగుదేశం పార్టీ ప్రథమస్థానంలో నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ జిల్లా సమన్వయకర్త వైఎస్ వివేకానందరెడ్డి పేర్కొన్నారు. బుధవారం పోరుమామిళ్ల పట్టణంలోని వసుంధర కల్యాణమండపంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆ«ధ్యర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లీనరీ జరిగింది. కార్యక్రమంలో ముఖ్య అథి«ధులుగా ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి,ప్లీనరి పరిశీలకులు ఇరగంరెడ్డి తిరుపాలురెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్ వివేకానందరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు తాను అవినీతికి పాల్పడటమే కాక పార్టీలోని మంత్రులు, నాయకులకు నేర్పిస్తూ ప్రజాధనం కొల్లగొడుతున్నారని ఆరోపించారు.
ఇసుక అక్రమ రవాణా, నీరు–చెట్టు పనులు ఇందుకు నిదర్శనమన్నారు. ప్రతిపక్ష పార్టీ ఎమ్మెల్యేలను సంతలో సరుకులు కొనుగోలు చేసినట్లు కొనడం చంద్రబాబుకే సరన్నారు. పార్టీ మారిన నాయకులకు రాజకీయ భవిష్యత్తు ఉండదని, రాబోయే ఎన్నికల్లో వీరు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగితే నిలదీయడం ఖాయన్నారు. ప్రస్తుతం రానున్న ఎన్నికలు చాలా కీలకమని, ప్రతి కార్యకర్త, నాయకులు ఐకమత్యంగా కృషి చేసి పార్టీ అభ్యర్థులను భారీ మోజారీటీతో గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు.
గుణపాఠం చెప్పేందుకు సిద్ధం కండి : వైఎస్ అవినాష్‌రెడ్డి
తెదేపా ప్రభుత్వానికి నూకలు దగ్గర పడ్డాయని, దీనికి గుణపాఠం చెప్పేందుకు వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు సిద్ధం కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డి పిలుపునిచ్చారు. చంద్రబాబు జన్మభూమి కమిటీలు వేసి వ్యవస్థను నాశనం చేశారని అన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి సీఎంగా ఉన్న సమయంలో జిల్లాను అభివృద్ధి చేసేందుకు పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటరీని 11 వేల క్యూసెక్కుల నుంచి 44 వేల క్యూసెక్కులకు పెంచారని, కొస్తాంధ్ర, తెలంగాణ ప్రతినిధులు అంగీకరించకపోయినా ధైర్యంతో ముందుకు సాగి పూర్తి చేశారని చెప్పారు. ప్రస్తుతం బ్రహ్మంసాగర్‌కు నీరు చేరేందుకు కాలువలు సరిగా లేవని, విషయాన్ని పలు పర్యాయాలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చినా ప్రయోజనం లేకపోయిందన్నారు. వైఎస్ జగన్ సీఎం కాగానే వెలిగోడు నుంచి బ్రహ్మంసాగర్ వరకు కాలువను పూర్తి చేసి ప్రాజెక్టులో 12 టీఎంసీల నీరు నిలిపుతామని హామీ ఇచ్చారు.
వంటకాల రుచుల గురించి మాట్లాడటమే మహానాడు: ఆకేపాటి
తెదేపా విశాఖపట్నంలో మహానాడు నిర్వహించింది కేవలం వంటకాల రుచుల గురించి మాట్లాడుకోవడానికే అన్నట్లు ఉందని వైఎస్సార్‌సీపీ జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథ్‌రెడ్డి పేర్కొన్నారు. మూడు రోజుల పాటు ప్లీనరి నిర్వహించినా ఒక్క ప్రజా సమస్యపై చర్చగాని, తీర్మానాలు కాని లేవన్నారు. 5 లక్షల ఓట్లతో గెలిచిన వైఎస్ జగన్‌కు లోకేష్ సవాలు విసరడం నక్కకు నాగలోకానికి ఉన్న తేడా ఉందన్నారు. చంద్రబాబు అవకాశ రాజకీయాలు చేయడంలో ముందుంటారని, జమ్మలమడుగులో ఎన్నో ఏళ్లుగా పార్టీకి సేవ చేస్తున్న రామసుబ్బారెడ్డిని కాదని ఆదినారాయణరెడ్డికి మంత్రిపదవి ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. వైఎస్ కుటుంబం నమ్ముకున్న వారికిఅండగా నిలుస్తుంటే, వెన్నుపొటు పొడవడం చంద్రబాబు ఆలవాటని చెప్పారు.
పులివెందుల కంటే ఎక్కువ మెజారీటీ: డీసీ గోవిందరెడ్డి
రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థికి పులివెందుల కంటే ఎక్కువ మెజార్టీ బద్వేలు నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థికి వస్తుందని ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి పేర్కొన్నారు. పార్టీలోని కార్యకర్తలు, నాయకులు కష్టపడి గెలిపిస్తే ఎమ్మెల్యే తెదేపాలో చేరడం దురదృష్టకరమన్నారు. బ్రహ్మంసాగర్‌కు పూర్తిస్థాయిలో నీటిని విడుదల చేయాలంటే వైఎస్సార్‌సీపీ అధికారంలోకి రావాలని, ఇందుకోసం ప్రతి ఒక్కరూ కష్టపడాలని సూచించారు. బద్వేలు సమస్యలు తీర్చడంలో వైఎస్ ముందుండేవారని, ఆయన మరణంలో నియోజకవర్గంలో అభివృద్ధి నిలిచిపోయిందని, వైఎస్ జగన్ సీఎంఅయితే తిరిగి కొనసాగుతుందని చెప్పారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ అధికారం చేపట్టడం, జగన్ సీఎం కావడం ఖాయన్నారు.
జగన్‌ను సీఎం చేద్దాం: ఇరగంరెడ్డి తిరుపాలురెడ్డి
రానున్న ఎన్నికల్లో వైఎస్ జగన్‌ను సీఎం చేసి రాజన్న పాలనను తిరిగి తెచ్చుకుందానమని ఇరగంరెడ్డి తిరుపాలు రెడ్డి అన్నారు. నియోజకవర్గంలోని సమస్య పరిష్కారానికి అందరం కలిసికట్టుగా కృషి చేస్తామని చెప్పారు. తెదేపా ఆగడాలకు భయపడాల్సిన అవసరం లేదని, కార్యకర్తలకు, నాయకులకు వైఎస్ జగన్ అండగా ఉంటారని చెప్పారు. కార్యక్రమంలో ఆయా మండలాల కన్వీనర్లు నల్లేరు విశ్వనాథరెడ్డి, సుదర్శనం, సి బాష, యోగానందరెడ్డి, బోడపాడు రామసుబ్బారెడ్డి, సరస్వతమ్మ, మల్లికార్జురెడ్డి, నాయకులు సింగసాని గురుమోహన్, మునెయ్య, ఎంపీపీలు చిత్తా విజయప్రతాప్‌రెడ్డి, పెద్దరామయ్య, జడ్పీటీసీలు శారదమ్మ, సుదర్శన్, వెంకటసుబ్బయ్య ఆచారి, రామక్రిష్ణారెడ్డి, సింగిల్ విండో అధ్యక్షులు పోలిరెడ్డి, సుందరరామిరెడ్డి, అంకన గురివిరెడ్డి, రామిరెడ్డి, నాయకులు కరెంట్ రమణారెడ్డి, నాగార్జునరెడ్డి, ఈశ్వరమ్మ, దాదాన భూపాల్‌రెడ్డి, పంగా గురివిరెడ్డి, చిత్తా రవిప్రకాష్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.