స్వచ్ఛతా మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను విడుదల | swachata mobile app postar relese | Sakshi
Sakshi News home page

స్వచ్ఛతా మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను విడుదల

Feb 16 2017 10:46 PM | Updated on Sep 5 2017 3:53 AM

స్వచ్ఛతా మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను విడుదల

స్వచ్ఛతా మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను విడుదల

పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీ ఆకే రవికృష్ణ గురువారం ఉదయం ఆవిష్కరించారు.

కర్నూలు : పారిశుద్ధ్య సమస్యల పరిష్కారానికి కర్నూలు మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఆధ్వర్యంలో స్వచ్ఛత మొబైల్‌ ఆప్‌ పోస్టర్‌ను కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌లో ఎస్పీ ఆకే రవికృష్ణ గురువారం ఉదయం ఆవిష్కరించారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా మొబైల్‌లో డౌన్‌లోడ్‌ చేసుకోవాలని ఎక్కడైనా చెత్త ఉండే పరిసరాలను ఫొటో తీసి ఈ ఆప్‌ ద్వారా అప్‌లోడ్‌ చేస్తే సంబంధిత మున్సిపల్‌ అధికారులకు సమాచారం నేరుగా వెళ్తుందని ఎస్పీ తెలిపారు. ఆప్‌ ద్వారా చెత్త సమస్యలను తెలియజేయడం ద్వారా స్వచ్ఛ కర్నూలుకు సహకరించాలని కోరారు. స్వచ్ఛతా ఆప్‌ను ప్రతి కాలేజ్, ప్రభుత్వ కార్యాలయం, ఎన్‌జీఓల సహకారంతో ప్రచారం చేస్తామని మున్సిపల్‌ హెల్త్‌ ఆఫీసర్‌ కళ్యాణ్‌ చక్రవర్తి తెలిపారు. కార్యక్రమంలో రెడ్‌క్రాస్‌ సంస్థ చైర్మన్‌ శ్రీనివాసులు, మేనేజర్‌ నాగరాజు తదితరులు పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement