వ్యక్తి అనుమానాస్పద మృతి | Suspicious death of a person | Sakshi
Sakshi News home page

వ్యక్తి అనుమానాస్పద మృతి

Aug 21 2016 7:06 PM | Updated on Sep 4 2017 10:16 AM

జిన్నారం మండలం వీరన్నగూడెంలో గోపాల్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు.

 జిన్నారం మండలం వీరన్నగూడెంలో గోపాల్(40) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. గోపాల్ (శనివారం) నిన్న పని నిమిత్తం బయటికి వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చిన తర్వాత మరుసటి రోజు(ఆదివారం) ఉదయం ఎంతసేపైనా నిద్రలేకపోయేసరికి కుటుంబసభ్యులు అనుమానం వచ్చి గమనించగా చనిపోయి ఉన్నాడు. కంటిపై గాయం అయిన ఆనవాళ్లు ఉన్నాయి. దీంతో కుటుంబసభ్యులు అనుమానం వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డాగ్‌స్క్వాడ్‌ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నారు.

 

Advertisement
 
Advertisement
Advertisement