కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు | suresh prabhu reach gannavaram airport | Sakshi
Sakshi News home page

కేంద్రమంత్రికి స్వాగతం పలికిన మంత్రులు

Aug 23 2016 3:54 PM | Updated on Sep 4 2017 10:33 AM

కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి.

విజయవాడ : కృష్ణా పుష్కరాలు మంగళవారంతో ముగియనున్నాయి. ఈ నేపథ్యంలో పుష్కర స్నానం ఆచరించేందుకు న్యూఢిల్లీ నుంచి గన్నవరం చేరుకున్న కేంద్ర రైల్వే శాఖ మంత్రి సురేష్ ప్రభుకు ఎయిర్పోర్టులో ఘన స్వాగతం లభించింది. ఆయనకు రాష్ట్ర డిప్యూటీ సీఎం ఎన్ చినరాజప్ప, మంత్రి కొల్లు రవీంద్ర ఘన స్వాగతం పలికారు. అనంతరం విజయవాడలో పుష్కరస్నానం ఆచరించేందుకు వీఐపీకి ఘాట్కు కేంద్రమంత్రి సురేష్ ప్రభు... మంత్రులతో కలసి పయనమయ్యారు.  


ఆ తర్వాత సురేష్ ప్రభు... నగరంలోని డీఆర్ఎం కార్యాలయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి నంద్యాల - ఎర్రగంట్ల రైల్వే లైన్, నంద్యాల - కడప పాసింజర్ రైలును రిమోట్ ద్వారా ప్రారంభిస్తారు. అలాగే రాష్ట్రంలో జరుగుతున్న రైల్వే అభివృద్ధి పనుల గురించి ఆ శాఖ ఉన్నతాధికారులతో సురేష్ ప్రభు సమీక్ష నిర్వహిస్తారు. సాయంత్రం సంగమం వద్ద పుష్కరాల ముగింపు కార్యాక్రమంలో సురేష్ ప్రభు పాల్గొంటారు.

Advertisement
 
Advertisement
Advertisement