‘ప్రశాంతంగా పోలింగ్‌’ | successfully complete mlc poling in anantapur | Sakshi
Sakshi News home page

‘ప్రశాంతంగా పోలింగ్‌’

Mar 10 2017 10:33 PM | Updated on Jun 1 2018 8:39 PM

పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి శుక్రవారం తెలిపారు.

అనంతపురం అర్బన్‌ : పశ్చిమ రాయలసీమ (వైఎస్‌ఆర్, అనంతపురం, కర్నూలు జిల్లాలు) పట్టభద్ర, ఉపాధ్యాయ నియోజకవర్గాల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోలింగ్‌ జిల్లాలో ప్రశాంతంగా జరిగిందని సహాయ రిటర్నింగ్‌ అధికారి, డీఆర్‌ఓ సి.మల్లీశ్వరిదేవి శుక్రవారం తెలిపారు. జిల్లాలో పట్టభద్ర ఓట్లు 63.25 శాతం పోలయ్యాయని, ఉపాధ్యాయ ఓట్లు 92.84 శాతం పోలయ్యాయన్నారు. రెవెన్యూ డివిజన్ల వారీగా చూస్తూ పట్టభద్ర ఓటర్లు కళ్యాణదుర్గంలో అధికంగా తమ ఓటు హక్కుని సద్వినియోగం చేసుకున్నారన్నారు. ధర్మవరం డివిజన్‌లో ఉపాధ్యాయ ఓటర్లు అధికంగా తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారన్నారు.

డివిజన్ల వారీగా ఓటింగ్‌ శాతం..
రెవెన్యూ డివిజన్‌    పట్టభద్రులు    ఉపాధ్యాయులు    
అనంతపురం        63.95        86.89    
ధర్మవరం              66.90        95.90    
కళ్యాణదుర్గం        72.60        93.60    
కదిరి                   67.69        94.75    
పెనుకొండ           69.83        93.07    

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement