క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని బాపునగర్ శివారులోని కందిగడ్డ తం డాలో సోమవారం చోటు చేసుకుంది.
క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి
Aug 2 2016 12:03 AM | Updated on Sep 28 2018 3:41 PM
చెన్నారావుపేట : క్వారీ గుంతలో పడి విద్యార్థి మృతి చెందిన సంఘటన మండలంలోని బాపునగర్ శివారులోని కందిగడ్డ తం డాలో సోమవారం చోటు చేసుకుంది. బాపునగర్ తండాకు చెం దిన డప్పు మోహన్ కుమారుడు రాజేందర్(15) జల్లీ గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో పదో తరగతి చదువుతున్నాడు. పాఠశాలకు సెలవు కావడంతో సోమవారం తోటి విద్యార్థులతో కలిసి ఆడుకోవడానికి కందిగడ్డ తండాకు వెళ్లాడు. ఆ తర్వాత పక్కనే క్వారీ వద్దకు బహిర్భూమికి వెళ్లగా అక్కడ గతంలో గ్రానైట్ కోసం తవ్విన గుంతలో నీళ్లు ఉండగా ప్రమాదవశాత్తు కాలు జారి అందులో పడ్డాడు. వెంటనే తోటి విద్యార్థులు తండావాసులకు తెలుపడంతో అక్కడికి వచ్చే వరకు రాజేందర్ మృతి చెందారు. ఈ మేరకు మృతదేహాన్ని వెలికితీయగా.. తల్లిదండ్రులు, కుటుం బ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు.
Advertisement
Advertisement