రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి | student die in road accident | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

Nov 23 2016 11:39 PM | Updated on Sep 4 2017 8:55 PM

రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చాణిక్య స్కూల్‌ సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయతీ కొత్తకోటకు చెందిన ఓసూరి అఖిల్‌ (22) ఒంగోలు వైపు పల్సర్‌ బైకుపై వెళ్తున్నాడు.

గిద్దలూరు రూరల్‌ : రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందాడు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని చాణిక్య స్కూల్‌ సమీపంలో బుధవారం జరిగింది. వివరాలు.. వైఎస్సార్‌ జిల్లా కలసపాడు మండలం ఎగువరామాపురం పంచాయతీ కొత్తకోటకు చెందిన ఓసూరి అఖిల్‌ (22) ఒంగోలు వైపు పల్సర్‌ బైకుపై వెళ్తున్నాడు. ఎదురుగా వస్తున్న లగేజీ వాహనం ఢీకొట్టింది. ప్రమాదంలో అఖిల్‌కు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఎస్సై మల్లికార్జున సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని చికిత్స కోసం ఢీకొట్టిన వాహనంలో పట్టణంలోని ఏరియా వైద్యశాలకు తరలించారు. డాక్టర్‌ సూరిబాబు అఖిల్‌కు చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement