రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి.
తాండూరు : రెండు రోజుల నుంచి కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఈ నేపథ్యంలో రంగారెడ్డి జిల్లా తాండూరు - వికారాబాద్‌ల మధ్యలో ఉన్న కందమెల్లి వాగు పొంగిపొర్లుతుంది. దాంతో తాండూరు - హైదరాబాద్ మధ్య వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గురువారం అర్ధరాత్రి నుంచి వాగు పొంగిపొర్లుతుంది. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది.