రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్–19 తైక్వాండో టోర్నమెంట్‌ను స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహిస్తామని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి చలపతిరావు తెలిపారు.
నేటి నుంచి రాష్ట్రస్థాయి తైక్వాండో టోర్నీ
Oct 4 2016 9:54 PM | Updated on Sep 4 2017 4:09 PM
నంద్యాల: రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్‌జీఎఫ్) అండర్–19 తైక్వాండో టోర్నమెంట్‌ను స్థానిక పద్మావతినగర్‌లోని ఇండోర్ స్టేడియంలో బుధవారం నిర్వహిస్తామని ఎస్‌జీఎఫ్ జిల్లా కార్యదర్శి చలపతిరావు తెలిపారు. ఆయన మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ 13 జిల్లాలకు చెందిన బాలురు, బాలికల జట్లు హాజరవుతాయని, ఒక్కో జట్టులో 8మంది క్రీడాకారులు కోచ్, మేనేజర్ ఉంటారని చెప్పారు. మూడు రోజుల పాటు టోర్నీ నిర్వహిస్తామన్నారు. టోర్నీలో ప్రతిభ చూపిన వారిని వచ్చే ఏడాది జనవరి 2 నుంచి 8వరకు ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక చేస్తామన్నారు.
Advertisement
Advertisement