తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం | started mother milk weekly celebrations | Sakshi
Sakshi News home page

తల్లిపాల వారోత్సవాలు ప్రారంభం

Aug 1 2016 9:38 PM | Updated on Sep 4 2017 7:22 AM

తల్లిపాల వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌ 1వ అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త కె.రాధ ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు.

ఆదిలాబాద్‌ : తల్లిపాల వారోత్సవాలు సోమవారం ప్రారంభమయ్యాయి. ఆదిలాబాద్‌ పట్టణంలోని సుందరయ్యనగర్‌ 1వ అంగన్‌వాడీ కేంద్రంలో అంగన్‌వాడీ కార్యకర్త కె.రాధ ఆధ్వర్యంలో జ్యోతి వెలిగించి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రసవమైన సంవత్సరంలోపు తల్లి పిల్లలకు పాలివ్వాలన్నారు. తల్లి పాలలో రోగనిరోధక శక్తి అధికంగా ఉంటుందని తెలిపారు. ప్రసవమైన వెంటనే వచ్చే పసుపచ్చని ముర్రు పాలను అప్పుడే జన్మించిన బిడ్డకు తప్పనిసరిగా పట్టాలని సూచించారు. ఈ నెల 7 వరకు ఈ వారోత్సవాలు కొనసాగుతాయని తెలిపారు. మొదట అంగన్‌వాడీ కేంద్రం నుంచి మహిళలతో కాలనీలో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో ఏఎల్‌ఎంఎస్‌ కమిటీ సభ్యులు భాగీర్త, రబ్బానీ, స్వరూప, లావణ్య, కష్ణవేణి, వర్ష, సారిక, జ్యోతి, నర్మద, తల్లులు, గర్భిణులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement