ఈ– ఆఫీసులను వేగవంతం చేయండి | speed up e - office | Sakshi
Sakshi News home page

ఈ– ఆఫీసులను వేగవంతం చేయండి

Nov 6 2016 12:06 AM | Updated on Oct 16 2018 6:33 PM

కాగిత రహిత పాలనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఈ– ఆఫీసులను అమల్లోకి తీసుకొస్తుందని, ఆ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేయాలని మున్సిపల్‌ పరిపాలన శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ కన్నబాబు ఆదేశించారు.

– మున్సిపల్‌ పరిపాలన శాఖ డైరెక్టర్‌ కన్నబాబు
 
కర్నూలు(టౌన్‌): కాగిత రహిత పాలనలో భాగంగా ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని మున్సిపాల్టీలలో ఈ– ఆఫీసులను అమల్లోకి తీసుకొస్తుందని, ఆ దిశగా ఏర్పాట్లను వేగవంతం చేయాలని మున్సిపల్‌ పరిపాలన శాఖ రాష్ట్ర డైరెక్టర్‌ కన్నబాబు ఆదేశించారు. శనివారం ఆయన సాయంత్రం స్థానిక నగరపాలకలో మున్సిపల్‌ కార్పొరేషన్‌లోని వివిధ విభాగాలు, ఇంజనీర్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రజలకు మెరుగైన సేవలు సత్వరమే అందించేందుకు ఈ – ఆఫీసు పాలన ఎంతో ఉపయోగకరమన్నారు. పాలనలో జవాబుదారీ తనం, నిర్ణీత గడువులోపు పనులు పూర్తి చేయడం సాధ్యమవుతుందన్నారు. అలాగే కర్నూలు నగరంలో రూ.కోట్లతో జరుగుతున్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. బిల్లుల్లో జాప్యం వల్ల పనులు సక్రమంగా జరగడం లేదనే ఫిర్యాదులు వస్తున్నాయన్నారు. మరోసారి ఈ పరిస్థితి పునరావృతం కానివ్వొదన్నారు. సమావేశంలో మున్సిపల్‌ కమిషనర్‌ ఎస్‌.రవీంద్రబాబు, ఇంజనీరింగ్‌ అధికారులు శివరామిరెడ్డి, రాజశేఖర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement