ప్రజాసాధికార సర్వే (పల్స్ సర్వే) కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు.
పల్స్ సర్వేకు ప్రత్యేక కేంద్రాలు
Mar 4 2017 11:42 PM | Updated on Sep 5 2017 5:12 AM
కర్నూలు(అగ్రికల్చర్): ప్రజాసాధికార సర్వే (పల్స్ సర్వే) కోసం ప్రత్యేక కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ హరికిరణ్ తెలిపారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ..కుటుంబంలోని ప్రతి ఒక్కరు తప్పని సరిగా సర్వే చేయించుకోవాలని సూచించారు. ప్రజాసాధికార సర్వే చేయించుకోని వారి కోసం తహసీల్దార్, మున్సిపల్ కార్యాలయాల్లో నమోదు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు వివరించారు. సర్వేలో నమోదు కాని ప్రజలు ఆన్‌లైన్ ద్వారా సర్వే కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
Advertisement
Advertisement