షాపులను ఖాళీ చేయించడం దారుణం | shops removed issue at chebrolu | Sakshi
Sakshi News home page

షాపులను ఖాళీ చేయించడం దారుణం

Oct 25 2016 11:37 PM | Updated on Sep 4 2017 6:17 PM

20 సంవత్సరాలుగా ఉంటున్నా దేవాదాయశాఖకు ఎటువంటి బాకీ లేకున్నా షాపులు ఖాళీ చేయించడం దారుణమని హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర అధ్యక్షుడు చేదులూరి గవరయ్య అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన షాపులు పాత వారితో దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తంచేస్తూ మంగళవారం కాకినాడ దేవాదాయశాఖ డెప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వద్ద షాపులకు చెందిన కుటుంబ సభ్యులతో, సమితి ఆధ్వర్

  • దేవాదాయశాఖ డీసీ కార్యాలయం వద్ద చేబ్రోలు వ్యాపారుల ధర్నా
  • రంగప్రవేశం చేసిన పోలీసులు
  • బోట్‌క్లబ్‌ (కాకినాడ):
    20 సంవత్సరాలుగా ఉంటున్నా దేవాదాయశాఖకు ఎటువంటి బాకీ లేకున్నా షాపులు ఖాళీ చేయించడం దారుణమని హిందూ ధర్మరక్షా సమితి రాష్ట్ర  అధ్యక్షుడు చేదులూరి గవరయ్య అన్నారు. గొల్లప్రోలు మండలం చేబ్రోలు గ్రామంలోని సీతారామస్వామి ఆలయానికి సంబంధించిన షాపులు పాత వారితో దౌర్జన్యంగా ఖాళీ చేయించారని ఆవేదన వ్యక్తంచేస్తూ మంగళవారం కాకినాడ దేవాదాయశాఖ డెప్యూటీ కమిషనర్‌ కార్యాలయం వద్ద షాపులకు చెందిన కుటుంబ సభ్యులతో, సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ 20 సంవత్సరాలుగా ఉంటున్న వారికి ఏ విధమైన నోటీసు ఇవ్వకుండా ఆలయ ఫౌండర్‌ వంశానికి చెందిన ఎ.అప్పారావు ఖాళీ చేయని వారిని బెదిరింపులుకు గురిచేశారన్నారు. షాపులను బహిరంగ వేలం నిర్వహించాలని పాట వేరొకరు పాడుకుంటే అప్పుడు ఖాళీ చేస్తామని షాపుల్లో ఉంటున్నవారు చెప్పారు. దేవాదాయశాఖ అసిస్టెంట్‌ కమిషనర్‌ రమేష్‌బాబు, ఇ¯ŒSస్పెక్టర్‌ సతీష్‌లు పోలీసుల సహకారంతో షాపులకు సీలు వేశారన్నారు. ఇటీవల పోలీసులు సహకారంతో సీలు తీసేందుకు అధికారులు ప్రయత్నించగా షాపు యాజమానులు, పరిషత్‌ సభ్యులు అడ్డుకోగా వారిని పోలీసులు అదుపులో తీసుకొన్నారన్నారు. దేవాదాయశాఖ డీసీ వచ్చేంత వరకూ తాము కదలబోమని భీష్మించుకొని కూర్చున్నారు. త్రీటౌ¯ŒS ఎస్సై చైతన్యకృష్ణ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. షాపు యజమానులు, కుటుంబ సభ్యులు, సమితి సభ్యులు 150 మంది బైఠాయించారు. డీసీ చందు హనుమంతరావు ఆందోళనకారులతో ఫో¯ŒSలో మాట్లాడుతూ ఈ సమస్యను దేవాదాయశాఖ కమిషనర్‌ దృష్టికి తీసుకువెళ్లి పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. దీంతో మధ్యాహ్నం మూడు గంటల నుంచి రాత్రి ఏడున్నర గంటల వరకూ నిర్వహించిన ధర్నాను ఆందోళనకారులు విరమించారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement