74 గ్రామాలకు సత్యసాయి నీటిసరఫరా బంద్
మండలంలోని పురుషోత్తపట్నంలోని శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా పథకం మొరాయించింది. దీంతో ఏజెన్సీ వాసులతో సహా ఐదు మండలాల్లోని 47 గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన గోదావరి జలాల సరఫరా నాలుగు రోజులుగా నిలిచిపోయింది. ఈ పథకం వద్ద ఉన్న మూడు మోటార్లు కాలిపోవడమే ఇందుకు కారణం.
పురుషోత్తపట్నం (సీతానగరం):
మండలంలోని పురుషోత్తపట్నంలోని శ్రీ సత్యసాయి తాగునీటి సరఫరా పథకం మొరాయించింది. దీంతో ఏజెన్సీ వాసులతో సహా ఐదు మండలాల్లోని 47 గ్రామాల ప్రజలకు శుద్ధి చేసిన గోదావరి జలాల సరఫరా నాలుగు రోజులుగా నిలిచిపోయింది. ఈ పథకం వద్ద ఉన్న మూడు మోటార్లు కాలిపోవడమే ఇందుకు కారణం. ఈ తాగునీటి పథకం వద్ద నుంచి శుద్ధి చే సిన గోదావరి జలాలను తాగునీరుగా అందించేందుకు ఈ మోటార్లు అవసరం. ఆరు నెలల క్రితం ఒక మోటారు వైరింగ్ కాలిపోయింది. దీనికి ఇంత వరకు వైండింగ్ చేయలేదు. వారం రోజుల క్రితం రెండో మోటార్, ఈనెల 12వ తేదీ రాత్రి మూడో మోటార్ వైరింగ్ కాలిపోయాయి. దీంతో ఇక్కడి సత్యసాయి వాటర్ ప్రాజెక్ట్ నుంచి సీతానగరం, కోరుకొండ, గోకవరం, దేవీపట్నం, రాజానగరం మండలాల్లోని 74 గ్రామాలకు తాగునీటి సరఫరా నిలిచిపోయింది. దీనిపై శ్రీసత్యసాయి డ్రింకింగ్ వాటర్ ప్రాజెక్ట్ సైట్ ఇంజనీర్ విజయ్‌కుమార్ ‘సాక్షి’తో మాట్లాడుతూ ఒక మోటార్‌కు ఆదివారం వైండింగ్ చే యించామని తెలిపారు. దాని సహాయంతో సోమవారం తాగునీటిని అందిస్తామన్నారు. మిగిలిన రెండు మోటార్ల వైండింVŠ నాలుగు రోజుల్లో పూర్తవుతుందని చెప్పారు.