వైభవం..స్నాతకోత్సవ సంబరం | sathyasai convocation | Sakshi
Sakshi News home page

వైభవం..స్నాతకోత్సవ సంబరం

Nov 22 2016 11:15 PM | Updated on Sep 4 2017 8:49 PM

వైభవం..స్నాతకోత్సవ సంబరం

వైభవం..స్నాతకోత్సవ సంబరం

నీలి,ఎరుపు వస్త్రధారులైన విద్యాకుసుమాలు సాయి నామాన్ని స్మరించగా.. వక్తల సందేశాత్మక ప్రసంగాల నడుమ సాయి కుల్వంత్‌ సభా మందిరంలో జరిగిన సత్యసాయి విద్యా సంబరం వైభవంగా సాగింది.

పుట్టపర్తి టౌన్‌ : నీలి,ఎరుపు వస్త్రధారులైన విద్యాకుసుమాలు సాయి నామాన్ని స్మరించగా.. వక్తల సందేశాత్మక ప్రసంగాల నడుమ సాయి కుల్వంత్‌ సభా మందిరంలో జరిగిన సత్యసాయి విద్యా సంబరం వైభవంగా సాగింది. సత్యసాయి డీమ్డ్‌ యూనివర్శిటీ 35వ స్నాతకోత్సవం మంగళవారం ప్రశాంతి నిలయంలో ఘనంగా జరిగింది. వేడుకల్లో చాన్సలర్‌ హోదాలో సుప్రీంకోర్టు మాజీ చీఫ్‌ జస్టిస్‌ వెంకటాచలయ్య పాల్గొన్నారు.

ముఖ్యఅతిథిగా కేంద్ర సాంకేతిక ప్రధాన సలహాదారు రాజగోపాల చిదంబరం హాజరయ్యారు.చాన్స్‌లర్‌ వెంకటాచలయ్య యూనివర్శిటీ పరిధిలోని నాలుగు క్యాంపస్‌లలో ఉత్తమ ప్రతిభ కనబరచిన 24 మంది విద్యార్థులకు బంగారు పతకాలు, విభిన్న రంగాలలో నిబద్ధతతో  కృషి చేసినందుకు నలుగురు విద్యార్థులకు ఆల్‌రౌండర్‌ గోల్డ్‌ మెడల్స్‌, 10 మంది పరిశోధన విద్యార్థులకు పీహెచ్‌డీలను ప్రదానం చేశారు.

Advertisement
 
Advertisement
Advertisement