‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్‌ ప్రారంభం | saavithri oka deepam short film starts | Sakshi
Sakshi News home page

‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్‌ ప్రారంభం

Oct 16 2016 6:14 PM | Updated on Apr 3 2019 9:17 PM

‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్‌ ప్రారంభం - Sakshi

‘సావిత్రి ఒక దీపం’ షూటింగ్‌ ప్రారంభం

సావిత్రి కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్‌ నిర్మాతలుగా ‘సావిత్రి ఒక దీపం’ పేరుతో నిర్మిస్తున్న లఘుచిత్రం షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది.

విజయవాడ (గాంధీనగర్‌) : సావిత్రి  కళాపీఠం వ్యవస్థాపకురాలు పరుచూరి విజయలక్ష్మి, గౌరవాధ్యక్షుడు ప్రభల శ్రీనివాస్‌ నిర్మాతలుగా ‘సావిత్రి ఒక దీపం’ పేరుతో నిర్మిస్తున్న లఘుచిత్రం షూటింగ్‌ ఆదివారం ప్రారంభమైంది. హోటల్‌ ఐలాపురంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సినీనటి వాణిశ్రీ పూజ చేసి అనంతరం క్లాప్‌ కొట్టి షూటింగ్‌ను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలుగు చలనచిత్ర పరిశ్రమలో కథానాయికగా సావిత్ర ఎంతో ఎత్తుకు ఎదిగారని కొనియాడారు. సావిత్రిలోని సేవాభావాన్ని లఘుచిత్రం ద్వారా నేటితరం నటీనటులకు తెలియజెప్పేందుకు కళాపీఠం చేస్తున్న ప్రయత్నం అభినందనీయమన్నారు. సావిత్రి తన జీవితంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందుకు తానే ప్రత్యక్ష సాక్షినని వాణిశ్రీ తెలిపారు. నిర్మాతలు పరుచూరి విజయలక్ష్మి, ప్రభల శ్రీనివాస్‌ మాట్లాడుతూ సావిత్రి కీర్తిప్రతిష్టలను మరింత ఇనుమడింపజేసేందుకు ఈ లఘుచిత్రం నిర్మిస్తున్నట్లు చెప్పారు. మాస్టర్‌ శ్రీనాగ్‌హితేన్‌ సమర్పణలో కె.మోహన్‌ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంక, శ్రీవి ప్రధాన పాత్రలు పోషిస్తున్నారని తెలిపారు. సావిత్రి కళాపీఠం కార్యదర్శి తోట కృష్ణకిషోర్, కొత్తా జ్యోతి, ఐలాపురం శ్రీదేవి, దారా కరుణశ్రీ, పైడిపాటి వెంకన్న, కోట ఆంజనేయశాస్త్రి, సురేష్, చందన పాల్గొన్నారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement