ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి దుర్మరణం
నెల్లూరు (క్రైమ్) : బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. బస్సు చక్రాలు ఓ వ్యక్తి తలపైకి ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి.
నెల్లూరు (క్రైమ్) : బైక్‌పై వస్తున్న ఇద్దరు వ్యక్తులను ఆర్టీసీ బస్సు ఢీకొంది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. బస్సు చక్రాలు ఓ వ్యక్తి తలపైకి ఎక్కడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఈ సంఘటన శెట్టిగుంటరోడ్డు వద్ద బుధవారం చోటు చేసుకుంది. ఉస్మాన్‌సాహెబ్‌పేట కృష్ణమందిరం ప్రాంతానికి చెందిన వై. వెంకటనరసింహం పౌరోహిత్యం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. అదే ప్రాంతానికి చెందిన కె. రామయ్య (64) అతని వద్ద సహాయకుడిగా పనిచేస్తున్నాడు. ఈ నేపథ్యంలో బుధవారం బోడిగాడితోటలో కర్మక్రియలు చేసేందుకు వెంకటనరసింహం, రామయ్య వెళ్లారు. అక్కడ పనులు ముగించుకుని తమ యాక్టివా బైక్‌పై ఇంటికి బయలుదేరారు. శెట్టిగుంట రోడ్డు వద్దకు వచ్చేసరికి మితిమీరిన వేగంతో ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు నెల్లూరు వస్తుండగా వారి బైక్‌ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో ఇద్దరు రోడ్డుపై పడ్డారు. రామయ్య తలపైకి బస్సు చక్రాలు ఎక్కడంతో తలపగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. గాయపడని వెంకటనరసింహంను స్థానికులు హుటాహుటిన చికిత్స నిమిత్తం డీఎస్‌ఆర్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని నార్త్ ట్రాఫిక్ ఇన్‌స్పెక్టర్ జి. వెంకటరావు, ఎస్‌ఐ కొండయ్య పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన ఆర్టీసీ బస్సును స్వాధీనం చేసుకుని పోలీసుస్టేషన్‌కు తరలించారు. ప్రమాద విషయం తెలుసుకున్న రామయ్య కుటుంబం సంఘటనా స్థలానికి చేరుకుని కన్నీటి పర్యంతమైయింది. భర్త మృతదేహాన్ని చూసి సరోజనమ్మ గుండెలవిసేలా రోదించారు. మృతదేహానికి ప్రభుత్వ వైద్యులు నిర్వహించి బాధిత కుటుంబ సభ్యులకు అప్పగించారు. ట్రాఫిక్ ఎస్‌ఐ కొండయ్య కేసు దర్యాప్తు చేస్తున్నారు.