రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దూర ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో పండుగ పూట టికెట్ చార్జీలు భారీగా పెంచింది.
	అనంతపురం న్యూసిటీ: రోడ్డు రవాణా సంస్థ (ఆర్టీసీ) దూర ప్రాంతాలకు నడుపుతున్న సర్వీసుల్లో పండుగ పూట టికెట్ చార్జీలు భారీగా పెంచింది. ప్రత్యేక బస్సుల్లో మాత్రమే టికెట్ ధర పెంచుతారు. అయితే అది మాటల వరకే పరిమితమైంది. రెగ్యులర్ సర్వీసుల్లోనూ టికెట్‌పై 50 శాతం మేర అదనంగా దండుకోనుంది. ఇదేమని అడిగితే ‘పండుగ పూట మామూలే కదా’ అని అంటోంది. అనంతపురం రీజియన్‌లోని 13 డిపోల నుంచి రెగ్యులర్ సర్వీసులు కాక 80 స్పెషల్ బస్సులు తిప్పనున్నారు. హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, తిరుపతి, విజయవాడ, నెల్లూరు ప్రాంతాలకు అధిక సర్వీసులు పంపనున్నారు. అందుకోసం పలు ప్రాంతాల సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. ఫ్లెక్స్‌బుల్ ఫెయిర్ పేరుతో రెగ్యులర్ సర్వీసుల్లోనూ అదనంగా డబ్బులు వసూలు చేయనున్నారు.
	
	పండుగ సీజన్‌లో మామూలే..
	రెగ్యులర్ సర్వీసుల్లో సాధారణ ధర మాత్రమే కేటాయించాం. స్పెషల్ సర్వీసుల్లో మాత్రం వన్ అండ్ ఆఫ్ ధర (టకెట్ ధరకు అదనంగా) వసూలు చేస్తాం. పండుల సీజన్‌లో మామూలే.
	
	వివిధ ప్రాంతాలకు వెళ్లే స్పెషల్ బస్సుల టికెట్ ధరలు ఇవే...
	సర్వీసు         రెగ్యులర్ సర్వీసు ధర    స్పెషల్ ధర     
	హైదరాబాద్     రూ. 473        రూ. 682    
	చెన్నై        రూ. 550         రూ. 807    
	బెంగళూరు         రూ. 320        రూ. 459    
	బెంగళూరు(ఎక్స్‌ప్రెస్)రూ. 232        రూ. 330    
	విజయవాడ     రూ. 620        రూ. 900    
	తిరుపతి(ఎక్స్‌ప్రెస్)    రూ. 281        రూ. 409    

 
                                                    
                                                    
                                                    
                                                    
                                                    
                        
                        
                        
                        
                        
