చెన్నూరులో చోరీ | Robbery in Chennur | Sakshi
Sakshi News home page

చెన్నూరులో చోరీ

Sep 18 2016 1:21 PM | Updated on Aug 30 2018 5:27 PM

తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లిన సంఘటన అదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది.

చెన్నూరు (ఆదిలాబాద్) : తాళం వేసి ఉన్న ఇంట్లో దొంగలు పడి ఉన్నకాడికి దోచుకెళ్లిన సంఘటన అదిలాబాద్ జిల్లా చెన్నూరు మండలం కిష్టంపేటలో శనివారం రాత్రి చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన మారుపాక పోచం అనే వ్యక్తి ఇంటికి తాళం వేసి బంధువుల ఇంట్లో జరిగే శుభకార్యానికి వెళ్లి వచ్చేసరికి దొంగలు పడి ఇంట్లో ఉన్న తులం బంగారం, 16 తులాల వెండి ఆభరణాలతో పాటు కొంత నగదు, టీవీ, ఫ్యాన్ వంటి ఎలక్ట్రిక్ గృహోపకరణాలను ఎత్తుకెళ్లారు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరిస్తున్నారు.

Advertisement
 
Advertisement
Advertisement