రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి | road accident.. two died | Sakshi
Sakshi News home page

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

Aug 21 2016 11:01 PM | Updated on Aug 30 2018 4:07 PM

రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రెడ్డిపల్లిలోని 44 వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది.

చేగుంట: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన సంఘటన రెడ్డిపల్లిలోని 44 వ జాతీయ రహదారిపై ఆదివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. సికింద్రాబాద్‌ నల్లగుట్టకు చెందిన షేక్‌ బాహరలి (60) షేక్‌ నాజరలి (58) నిజామాబాద్‌ నుండి హైదరాబాద్‌ వైపు ఓమినీ వ్యానులో వెళుతున్నారు.

ఈ క్రమంలో రెడ్డిపల్లి వద్దకు రాగానే వీరి ముందు వెళుతున్న ఓ బారీ వాహనాన్ని ఓమినీ వ్యాను డీకొట్టడంతో వారిద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన ఇరువురిని మెరుగైన వైద్యం కోసం  హైదరాబాద్‌కు  తరలిస్తుండగా మార్గమద్యంలో మృతి చెందినట్లు ఏఎస్‌ఐ యాదవరెడ్డి తెలిపారు. మృతుల కుటుంబ సభ్యులకు సమాచారం అందించి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్‌ఐ తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement