జిల్లా అంతటా వర్షాలు | rainfaall in ysr district | Sakshi
Sakshi News home page

జిల్లా అంతటా వర్షాలు

Jul 28 2016 11:18 PM | Updated on Sep 4 2017 6:46 AM

జిల్లా అంతటా వర్షాలు

జిల్లా అంతటా వర్షాలు

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కడప డివిజన్‌లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాయచోటి, వీరబల్లిలో 80.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది.

కడప అగ్రికల్చర్‌ :
బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లా అంతటా నాలుగు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ వర్షాలతో కడప డివిజన్‌లో చాలా ప్రాంతాలు జలమయమయ్యాయి. రాయచోటి, వీరబల్లిలో 80.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడప నగరంలోని మృత్యుజయకుంట, బుడగజంగం కాలనీ, ఆర్టీసీ బస్టాండ్‌ ఏరియా, అక్కాయపల్లె, గౌస్‌నగర్‌ తదితర ప్రాంతాలతో పాటు రాయచోటిలోని కొత్తపల్లె కాలనీలోకి వర్షపు నీరు వచ్చి చేరింది. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. బుధవారం రాత్రి నుంచి గురవారం ఉదయం వరకు జిల్లాలో సరాసరి 25.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కడపలో 76.4 మి.మీ, వల్లూరు 27.4, పెండ్లిమర్రి 12.2, చింతకొమ్మదిన్నె 48.8, చెన్నూరు 25.2, ఖాజీపేట 22.2, కమలాపురం 34.0, వీరపునాయునిపల్లె 56.4, చిన్నమండెం 24.2, సంబేపల్లె 76.6, టిసుండుపల్లె 47.4, లక్కిరెడ్డిపల్లె 26.2, చక్రాయపేట 22.4, రామాపురం 28.2, గాలివీడు 60.2, పుల్లంపేట 12.2, పోరుమవిళ్ల 17.4, బి కోడూరు 10.6, బద్వేలు 18.4, గోపవరం 10.6, కాశినాయన 21.2, బి మఠం 10.4,సిద్ధవటం 54.2, అట్లూరు 40.4, ఒంటిమిట్ట 71.4, జమ్మలమడుగు 12.4, ముద్దనూరు 35.8, కొండాపురం 42.2, ప్రొద్దుటూరు 21.4, చాపాడు 10.2, దువ్వూరు 10.4, మైదుకూరు 10.2, వేంపల్లె 12.4, వేముల 26.4, సింహాద్రిపురం 54.8 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైంది. పంటలకు కొంత మేరకు మేలు చేశాయని రైతులు చెబుతున్నారు. ఉద్యాన పంటలకు ఈ వర్షాలు ఊరటనిచ్చాయని ఆ శాఖ అధికారులు అంటున్నారు. ఈ వర్షాలతో కూరగాయల సాగు పెరుగుతుందని ఏడీలు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement