రెయిన్‌ గన్లతో రైతుల్లో ఆనందం | rain guns ke krishnamurthi farmers | Sakshi
Sakshi News home page

రెయిన్‌ గన్లతో రైతుల్లో ఆనందం

Sep 4 2016 11:10 PM | Updated on Oct 1 2018 2:11 PM

రెయిన్‌ గన్లతో రైతుల్లో ఆనందం - Sakshi

రెయిన్‌ గన్లతో రైతుల్లో ఆనందం

రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెయిన్‌ గన్‌ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని డిప్యూటీ సీఎం, రె

సామర్లకోట : రైతుల ప్రయోజనాల కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన రెయిన్‌ గన్‌ పథకంతో రైతులకు ఎంతో ప్రయోజనం జరుగుతుందని డిప్యూటీ సీఎం, రెవెన్యూశాఖా మంత్రి కేఈ కృష్ణమూర్తి అన్నారు. మండలం జి. మేడపాడులో మరో డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్పతో కలసి అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. గ్రామంలో వర్మీ  కంపోస్టు యూనిట్‌ను పరిశీలించారు. కమ్యూనిటీ భవనాలు, పంచాయతీ కార్యాలయం, రోడ్లకు వారు శంకుస్థాపన లు చేశారు. సొసైటీ భవనం గోదాములను  ప్రారంభించారు. సొసైటీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమానికి రాజప్ప అధ్యక్షత వహించగా కేఈ కృష్ణమూర్తి ముఖ్యఅతిథిగా ప్రసంగించారు. రెయిన్‌ గన్‌తో గంటకు 10 ఎకరాలు తడుస్తుందని చెప్పారు. పోలవరం ప్రాజెక్టు పూర్తితో జిల్లాలో రైతులకు నీటిఎద్దడి ఏర్పడిన సమయంలో ఏలేరు ప్రాజెక్టుకు పోలవరం ప్రాజెక్టు ద్వారా నీరు అందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. వెబ్‌ల్యాండ్‌లోని సమస్యలను పరిష్కరించవలసిన బాధ్యత తహసీల్దార్‌లపై ఉందని, జాప్యం చేస్తే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మేడపాడును ఓడీఎఫ్‌ గ్రామం ప్రకటించడం ఆనందంగా ఉందని చెప్పారు. రాయలసీమ జిల్లాలో మేడపాడును ఆదర్శంగా తీసుకొని పని చేస్తామని తెలిపారు. చినరాజప్ప మాట్లాడుతూ పేదల కోసం వెయ్యి ఇళ్ల పట్టాలు అందజేస్తున్నామన్నారు. ఎమ్మెల్సీలు బొడ్డు భాస్కరరామారావు, రెడ్డి సుబ్రహ్మణ్యం, జెడ్పీ చైర్మన్‌ నామన రాంబాబు,  కలెక్టర్‌ హెచ్‌.అరుణ్‌ కుమార్, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌లు పాలకుర్తి శ్రీనివాసాచార్యులు, ముత్యం రాజబ్బాయి, పెద్దాపురం మున్సిపల్‌ చైర్మన్‌ రాజా సూరిబాబురాజు, ఎంపీపీ గొడత మార్త, జెడ్పీటీసీ సభ్యురాలు గుమెళ్ల విజయలక్ష్మి, సర్పంచ్‌లు, ఎంపీటీసీ సభ్యులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement