కర్నూలులో రైల్వే డీఆర్‌ఎం తనిఖీలు | railway dm visits kurnool station | Sakshi
Sakshi News home page

కర్నూలులో రైల్వే డీఆర్‌ఎం తనిఖీలు

Jan 12 2017 12:02 AM | Updated on Sep 5 2017 1:01 AM

దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అరుణా సింగ్‌...బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు.

కర్నూలు(రాజ్‌విహార్‌): దక్షిణ మధ్య రైల్వే హైదరాబాద్‌ డివిజన్‌ డీఆర్‌ఎం అరుణా సింగ్‌...బుధవారం స్థానిక కర్నూలు సిటీ రైల్వే స్టేషన్‌లో తనిఖీలు నిర్వహించారు. మొదటి ప్లాట్‌ ఫాంతోపాటు రెండు, మూడవ ప్లాట్‌ ఫాంలలో ఉన్న మౌలిక సదుపాయాలను పరిశీలించారు. తాగునీరు. శుభ్రత, డ్రెయినేజి వ్యవస్థ, సౌకర్యాలను తనిఖీ చేశారు. రెండో ప్లాట్‌ ఫాంలోని కుర్చీలు, ఫ్యాన్లు తదితరాలను పరిశీలించారు. ఎస్కలేటర్ల పనితీరు, ప్లాట్‌ఫాం ట్రాకులను సైతం చూశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైల్వే స్టేషన్‌తోపాటు ఆవరణాన్ని కూడా పరిశుభ్రంగా ఉంచాలన్నారు. ఏదైనా అసౌకర్యాలు ఏర్పడితే సహించబోమన్నారు. ఆమె వెంట కర్నూలు స్టేషన్‌ మేనేజరు మక్బూల్‌ హుసేన్, బుకింగ్‌ సూపర్‌వైజర్లు మెయిన్, మునీర్, రమాదేవి, టికెట్‌ ఇన్‌స్పెక్టర్‌ వెంకటేశ్వర్లు ఉన్నారు.
 

Advertisement
 
Advertisement
Advertisement