సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి పైలా రాజీనామా! | pyla narasimhaiah resign the cpi | Sakshi
Sakshi News home page

సీపీఐ ప్రాథమిక సభ్యత్వానికి పైలా రాజీనామా!

Mar 9 2017 12:17 AM | Updated on Sep 5 2017 5:33 AM

సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పైలా నరసింహయ్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

తాడిపత్రి రూరల్‌ : సీపీఐ నియోజకవర్గ ఇన్‌చార్జ్‌ పైలా నరసింహయ్య ఆ పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ మేరకు బుధవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో తన సొంత నిర్ణయంతోనే నామినేషన్‌ వేశానని, పార్టీకి సంబంధం లేదని అందులో పేర్కొన్నారు. తన కుటుంబ సభ్యుల ఒత్తిడి మేరకే నామినేషన్‌ను విత్‌డ్రా చేసుకున్నట్లు తెలిపారు. పార్టీ ప్రమేయం లేకుండా నామినేషన్‌ వేయడం తప్పుగా భావించి ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement
 
Advertisement
Advertisement