ప్రజాపంపిణీకి ఇబ్బంది రానీయం | public distribution no bother | Sakshi
Sakshi News home page

ప్రజాపంపిణీకి ఇబ్బంది రానీయం

Nov 25 2016 1:54 AM | Updated on Sep 4 2017 9:01 PM

కర్నూలు నగరంలో డిసెంబరు నెల ప్రజా పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు.

–ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం
–జేసీ హరికిరణ్‌ వెల్లడి
కర్నూలు(అగ్రికల్చర్‌): కర్నూలు నగరంలో డిసెంబరు నెల ప్రజా పంపిణీకి ఎలాంటి ఇబ్బంది లేకుండా తగిన చర్యలు తీసుకుంటున్నట్లుగా జాయింట్‌ కలెక్టర్‌ హరికిరణ్‌ తెలిపారు. వంద మంది డీలర్లు సస్పెండ్‌ అయినందున ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ముమ్మరంగా జరుగుతున్నాయని తెలిపారు. గురువారం ఆయన సాక్షితో మాట్లాడుతూ... కొన్ని షాపులకు ఇన్‌చార్జీలను నియమిస్తున్నామన్నారు. మరికొన్ని షాపులకు తాత్కాలిక డీలర్లుగా నియమించేందుకు ఈ–పాస్‌ మిషన్‌లను ఆపరేట్‌ చేయగల యువకులను గుర్తిస్తున్నామన్నారు. ఈ–పాస్‌ మిషన్‌లను బైపాస్‌ చేసి అక్రమాలకు పాల్పడిన 149 మంది డీలర్లపై పోలీసులు కేసులు నమోదు చేశారని తెలిపారు. డీలర్లు కోర్టుకు వెళ్లారని, దీనిపై శుక్రవారం తీర్పు వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.  ప్రజాసాధికార సర్వేలో జిల్లా రాష్ట్రంలో 6వ స్థానంలో ఉందని వెల్లడించారు. 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement