మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం | provide facilities for victims family | Sakshi
Sakshi News home page

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

Sep 27 2016 9:10 PM | Updated on Sep 4 2017 3:14 PM

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

మృతుడి కుటుంబాన్ని ఆదుకుంటాం

చండూరు : అనారోగ్యంతో మృతి చెందిన అన్నెపర్తి మోహన్‌(28) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు.

చండూరు : అనారోగ్యంతో మృతి చెందిన అన్నెపర్తి మోహన్‌(28) కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటి రెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం చండూరులో అనారోగ్యంతో మృతి చెందిన మోహన్‌ కుటుంబాన్ని ఆయన పరామర్శించారు. ఈ సందర్భంగా రూ. లక్ష ఆర్థికS సహాయం అందించారు. అనంతరం ఆయన మాట్లాడారు యువకుడు మోహన్‌ మృతి తీరని లోటన్నారు. ప్రతీక్‌ పౌండేషన్‌ ఆధ్వర్యంలో ఇద్దరు చిన్నారులను ఆదుకునేందుకు నిర్ణయం తీసుకున్నామన్నారు. కార్యక్రమంలో సర్పంచ్‌ కలిమికొండ పారిజాత, జనార్దన్, కోడి గిరిబాబు, నాయకులు దోటి వెంకటేశ్‌ యాదవ్, రావిరాల నగేష్, జకలి శ్రీను తదిరులు ఉన్నారు.  
 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement